రాజీనామాకు సిద్ధం: జగన్‌తో వైసీపీ ఎంపీలు, 'భవిష్యత్తు ఉండదు'
ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను రాజీనామాకు సిద్ధమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆదివారం నాడు వెల్లడించారు.
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను రాజీనామాకు సిద్ధమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆదివారం నాడు పార్టీ అధ్యక్షులు జగన్‌కు చెప్పారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఏపీ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతామన్నారు. విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ సహా అన్ని అంశాలపై నిలదీస్తామన్నారు. హోదా అంశంపై టీడీపీ ఎంపీలు కలిసి రావాలన్నారు.

ఆదివారం నాడు వైసీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఏం చేసేందుకైనా తాము సిద్ధమన్నారు. అవసరమైతే రాజీనామాలు చేస్తామన్నారు.
విభజనతో ఏపీకి నష్టం జరిగింది: మేకపాటి
విభజనతో ఏపీ అన్ని విధాల నష్టపోయిందని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఎంపీల భేటీ అనంతరం ఆయన మీడియాతో మేకపాటి మాట్లాడారు. మిగిలిన రాష్ట్రాలతోపాటు సమానంగా అభివృద్ధి చేయాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు.
అప్పుడే పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. అప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్ చేసిన టిడిపి, బీజేపీలు.. ఇప్పుడు దానిని తుంగలో తొక్కాయన్నారు. హోదాకు, ఫ్యాకేజీకి ఏమీ తేడా లేదని సీఎం చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు.
గళం విప్పండి: వైయస్ జగన్
ఏపీకి హోదాయే సంజీవిని అని, లేదంటే రాష్ట్రానికి భవిష్యత్తు లేదని వైసిపి అధినేత జగన్ ఎంపీలతో చెప్పారు. హోదా కోసం పార్లమెంటులో గళమెత్తాలని సూచించారు. ప్యాకేజీ పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ విషయం ప్రజల దృష్టికి మరింత తీసుకెళ్లాలన్నారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications