వైసీపీ ఎంపీలను పంచుకుంటున్న కూటమి - ఎవరెటు..!!
వైసీపీకి భారీ షాక్. వైసీపీ రాజ్యసభ సభ్యులు పెద్ద సంఖ్యలో పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత ముఖ్య నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. రాజ్యసభలో వైసీపీకి ప్రస్తుతం 11 మంది సభ్యుల సంఖ్యా బలం ఉంది. టీడీపీకి పెద్దల సభలో ప్రాతినిధ్యం లేదు. ఈ సమయంలో వైసీపీలోని మెజార్టీ సభ్యులను కూటమిలోని మూడు పార్టీలు చేర్చుకొనేందకు రంగం సిద్దమైంది. దాదాపు 7 గురు పార్టీ వీడేందుకు సిద్దమయ్యారని సమాచారం.
రాజీనామాలు
వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో ఏడుగురు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన రావు ఈ రోజు వైసీపీకి రాజీనామా చేయనున్నారు. వీరిద్దరూ గురువారం ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీన్ ధన్‌ఖడ్‌ను కలిసి రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా సమర్పించబోతున్నారు. ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథరెడ్డి, ఆర్.కృష్ణయ్య, గొల్ల బాబూరావుతో పాటు మరికొందరు కీలక నేతలు పార్టీని వీడబోతున్నారని ప్రచారం సాగుతోంది.

కూటమిలోకి
రాజ్యసభలో వైసీపీకి కి 11 మంది ఎంపీలు ఉండగా.. ఇక అక్కడ మిగిలేది జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, పరిమల్ నత్వానీ మాత్రమేనని తెలుస్తోంది. టీడీపీలోకి నలుగురు, బీజేపీలోకి ముగ్గురు, ఒకరు జనసేనలోకి వెళ్తారని తెలుస్తోంది. మోపిదేవి, మస్తాన రావు, బాబూరావు, ఆర్.కృష్ణయ్య టీడీపీలోకి వెళ్లేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. అదే విధంగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాధ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లుగా చెబుతున్నారు.
ఎవరెటు
వీరిలో ఒకరిని జనసేనలోకి పంపేందుకు కూటమి నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో, రాజ్యసభలో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ వీరంతా రాజీనామా చేస్తే కేవలం నలుగురు సభ్యులకే పరిమితం కానుంది. విజయసాయిరెడ్డి తన పార్టీ మార్పు పైన స్పష్టత ఇచ్చారు. ఇక..వైసీపీ ఎమ్మెల్సీలు వరుసగా పార్టీ మారుతారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే, వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీ లో చేరే రాజ్యసభ సభ్యుల్లో కొందరికి తిరిగి టీడీపీ నుంచి అవకాశం..మరి కొందరికి ఇతర పదవుల పైన హామీ దక్కినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications