బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ప్రత్యక్షమైన రఘురామ కృష్ణంరాజు..!!
అమరావతి: రఘురామ కృష్ణంరాజు.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు నాయకుడిగా పేరు తెచ్చుకున్న లోక్‌సభ సభ్యుడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా సొంత పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వానికి కొరుకుడు పడని నేతగా గుర్తింపు పొందారు. ప్రభుత్వం తీసుకుంటోన్న విధానపరమైన నిర్ణయాలు, అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులన్నింటిపైనా విమర్శలు గుప్పిస్తుంటారు.

ప్రతిపక్షాలతోనే సఖ్యత..
అధికార పార్టీకి చెందిన ఎంపీ అయినప్పటికీ- ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా వ్యవహరిస్తుంటారాయన. దీన్ని బలపరిచే సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక వర్గానికి చెందిన మీడియా, ప్రతికాధిపతులకు రఘురామ కృష్ణంరాజు చాలా ఇష్టుడనే అభిప్రాయాలు సైతం ప్రజల్లో లేకపోలేదు. ఏపీ సీఐడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసినప్పుడు రఘురామ కృష్ణంరాజుకు మద్దతుగా టీడీపీ నేతలు ఆందోళనలు చేయడం దీనికి నిదర్శనం.

హస్తినలో పలుకుబడి..
అలాగే- బీజేపీ జాతీయ స్థాయి నాయకులతో సత్సంబంధాలను కొనసాగిస్తుంటారు రఘురామ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. వంటి శక్తిమంతులైన నేతలను తరచూ కలుసుకునే స్థాయిలో ఆయనకు ఢిల్లీలో పలుకుబడి ఉంది. జగన్ సర్కార్ వేస్తోన్న ప్రతి అడుగుపైనా రఘురామ కృష్ణంరాజు తనదైన శైలిలో విమర్శలను సంధిస్తుంటారు. ఆరోపణలను గుప్పిస్తుంటారు.

నియోజకవర్గంలో అడుగు పెట్టట్లే..
రఘురామ కృష్ణంరాజు సొంత లోక్ సభ నియోజకవర్గం.. నరసాపురం. చాలాకాలంగా ఆయన తన నియోజకవర్గానికి దూరంగా ఉంటోన్నారు. ఓ ప్రజా ప్రతినిధి ఇన్ని సంవత్సరాలుగా తనను గెలిపించిన ఓటర్లకు దూరంగా గడపడం కూడా ఓ రికార్డుగానే చెప్పుకోవచ్చు. ఆయనపై పలు కేసులు నమోదు కావడం వల్ల నియోజకవర్గానికి రావట్లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. స్టుపిడ్ పాలిటిక్స్ కారణంగా తాను నియోజకవర్గానికి దూరంగా ఉన్నానంటూ రఘురామ ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

త్రిపురలో ప్రత్యక్షం..
ఈ పరిణామాల మధ్య రఘురామ కృష్ణంరాజు.. తాజాగా త్రిపురలో ప్రత్యక్షం అయ్యారు. తన భార్యతో కలిసి ఆయన ఢిల్లీ నుంచి అగర్తల వెళ్లారు. అక్కడ బీఎస్ఎఫ్ అధికారులతో కలిసి దిగిన ఓ ఫొటోను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం తాను భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్నానని తెలిపారు.

త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం..
ప్రస్తుతం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఫిబ్రవరి 16వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటికే షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఒకేదశలో పోలింగ్ ముగియనుంది. త్రిపురతో పాటు మేఘాలయా, నాగాలాండ్ లల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ షెడ్యూల్ చేసింది ఈసీ. మార్చి 2వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications