Raghurama : వైసీపీకి ఈసారి వచ్చే సీట్లు ఇవే..! సర్వే రిపోర్ట్ తో తేల్చేసిన రఘురామ..
ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటూ ఎత్తులు, పైఎత్తులు వేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో తమ పార్టీ పరిస్ధితి ఎలా ఉంది, వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తాం, ఎన్ని సీట్లలో ఓడిపోతారన్న దానిపై సర్వేలపైనా ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇదే క్రమంలో కొత్తగా ఏ సర్వే వచ్చినా దానిపై అన్ని రాజకీయ పార్టీల దృష్టీ నెలకొంటోంది.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ మరోసారి గెలుస్తుందా లేదా, గెలిస్తే ఎన్ని సీట్లు గెలుస్తుంది, ఇందులో ఎమ్మెల్యే సీట్లు ఎన్ని, ఎంపీ సీట్లు ఎన్ని అనే అంశాలపై తాజాగా ఢిల్లీ స్ధాయిలో పలు సర్వేలు జరుగుతున్నట్లు రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఇందులో వ్యక్తమవుతున్న అంచనాల మేరకు వైసీపీకి రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు రాబోతున్నాయో రఘురామ ఇవాళ వెల్లడించారు. ఇందులో ఎంపీ సీట్లతో పాటు ఎమ్మెల్యే సీట్లు కూడా ఉన్నాయి.

వివిధ సర్వే ఏజెన్సీల తాజా అంచనాల ప్రకారం వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఏపీలో నాలుగైదు ఎంపీ సీట్లు రావడం కూడా కష్టమేనని రఘురామ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీకి ఈసారి ఎన్నికల్లో ఆరుశాతం ఓట్లు తగ్గబోతున్నట్లు కూడా రఘురామ తెలిపారు. దీంతో ఎంపీ సీట్లతో పాటు ఎమ్మెల్యే సీట్లపైనా ప్రభావం పడుతుందన్నారు. అలాగే ఒకప్పుడు కాంగ్రెస్ కు, ఇప్పుడు వైసీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లు చీలబోతున్నట్లు రఘురామ పేర్కొన్నారు.
అలాగే ఈసారి కాంగ్రెస్ గెలుపుతో సంబంధం లేకుండా ముస్లింలు ఆ పార్టీకి ఓటు వేయబోతున్నట్లు రఘురామ తెలిపారు. దీంతో పాటు వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇస్తే వైసీపీపై ఇంకా ప్రభావం పడే అవకాశముందన్నారు. మరోవైపు ఏపీలో ఈసారి వైసీపీకి 40 అసెంబ్లీ సీట్లు లభించే అవకాశం ఉందని రఘురామరాజు వెల్లడించారు. దీంతో సజ్జల కూడా ఎన్నికల గురించి మాట్లాడటం లేదన్నారు. మరోవైపు రాష్ట్రంలో విపక్షాల పొత్తు ప్రకటనకు మరికొంత సమయం ఉందన్నారు.












Click it and Unblock the Notifications