రఘురామ విడుదల మరింత ఆలస్యం- ఆర్మీ డాక్టర్ల మెలిక- 4 రోజుల తర్వాతే

వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. సుప్రీంకోర్టులో తన వైద్య పరీక్షల కోసం ఎంచుకున్న ఆర్మీ ఆస్పత్రే ఇప్పుడు ఆయనకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసినా ఆయన ఇంటికి వెళ్లేందుకు మాత్రం ఆర్మీ వైద్యులు అంగీకరించడం లేదని సమాచారం. రఘురామ ఆరోగ్య పరిస్ధితే అందుకు కారణం.

శుక్రవారం సుప్రీంకోర్టులో బెయిల్‌ అందుకున్న రఘురామరాజుకు ఆ తీర్పు కాపీ అందే సరికి శనివారం అయింది. ఆ తర్వాత ఆదివారం కావడంతో సెలవురోజు సీఐడీ కోర్టులో బెయిల్‌ అప్పీలు చేసేందుకు వీల్లేకుండా పోయింది. అలా రెండు రోజులు వృథా అయ్యాయి. ఎట్టకేలకు ఇవాళ బెయిల్‌ కోసం అభ్యర్దించే సమయంలో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు అడ్డుపుల్ల వేశారు. ప్రస్తుతం మీ కాలి వేలి గాయం తగ్గలేదు కాబట్టి మరో నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో రఘురామ ఆర్మీఆస్పత్రికే పరిమితం అయ్యారు.

ysrcp rebel mp raghurama rajus release delay by 4 days after army doctors advice

సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి రఘురామకృష్ణంరాజు ఫిట్‌గా ఉన్నారని నివేదిక ఇచ్చాకే సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. బెయిల్‌ వచ్చినా ఆర్మీ వైద్యులు రఘురామను పిట్‌గా లేకుండా ఇంటికి పంపే అవకాశం లేదు. దీంతో మరో నాలుగు రోజుల తర్వాత ఆయన్ను డిశ్చార్జ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో సీఐడీ కోర్టులో బెయిల్‌ తీసుకుంటే రఘరామరాజు ఇంటికెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్న రఘురామ బెయిల్ లభించగానే గచ్చిబౌలిలోని తన ఇంటికి వెళ్లనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ 24 గంటల ముందు నోటీసులు ఇస్తే గుంటూరులో విచారణకు హాజరవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+