వైసీపీకి ఆయనే మెయిన్ స్టార్ క్యాంపెయినర్: పూర్తి జాబితా ఇదే
YS Jagan: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. ఈ నెల 29వ తేదీ నాటితో నామినేషన్ల ప్రక్రియ మొత్తం ముగిసింది. మే 13వ తేదీన పోలింగ్. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకరవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
పోలింగ్ గడువు దగ్గర పడుతోండటం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తోన్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. 2019 నాటి ఎన్నికల్లో సాధించిన పట్టును నిలుపుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రూపొందించుకుంది. అప్పటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.

ఈ సంఖ్యను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో ఉందా పార్టీ అగ్రనాయకత్వం. వైనాట్ 175/25 అనే నినాదంతో ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి అవసరమైన స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేసింది వైఎస్ఆర్సీపీ. మొత్తం 37 మందితో కూడిన జాబితా ఇది.
ఇందులో- వైఎస్ జగన్, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, మహ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్, కే భాగ్యలక్ష్మి, గొల్ల బాబూరావు, డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మల్లాది విష్ణు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, వీ ఖాదర్ బాష, కుంభా రవిబాబు ఉన్నారు.
ఆర్ కృష్ణయ్య, పోసాని కృష్ణమురళి, వాసిరెడ్డి పద్మ, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వీ విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మద్దాలి గిరి, రావెల కిశోర్ బాబు, జకియా ఖానమ్, ఎస్ ఎం జైనుద్దీన్, శిద్ధా రాఘవరావు, గంగు కల్యాణి, షేక్ సందని, ఓరేకంటి జనార్థన్ రెడ్డిలకు చోటు దక్కింది.
దాజప్పగారి జనపా రూపాణి, చెల్లె పరంజ్యోతి, పందలనేని శివప్రసాద్, కట్టా జగదీష్, కృష్ణం రామకృష్ణ, గొల్లపల్లి శ్రీను, సయ్యద్ అన్వర్, అనూషభట్టు అనంత లక్ష్మి, చల్లా ఈశ్వరి.. వైసీపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసేంత వరకూ వారంతా పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉంటుంది.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications