ఫ్లెమింగో పక్షులే కాదు.. పులస చేపలకూ..! పవన్ కు భూమన సూచన..!

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా అధికారులకు ఓ సూచన చేశారు. పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలనేది ఆ సూచన. పర్యావరణ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన ఆ సూచనపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యంగంగా స్పందించారు. పవన్ చేసిన సూచనను ఓవైపు స్వాగతిస్తూనే అలాగే పులస చేపలకూ ఇలాగే శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలంటూ భూమన సెటైర్లు వేశారు.

పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలని డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా తన శాఖకు చెందిన అధికారుల్ని కోరారు. ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్... ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దుతామన్నారు.
పులికాట్ సరస్సుకు శీతాకాలం అతిథుల రాక మొదలైందని, వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్న సైబీరియన్ పక్షులు... ఫ్లెమింగోలు మనందరికీ కనువిందు చేయడానికి సిద్ధమయ్యాయని తెలిపారు. ఆహారం, విశ్రాంతి నిమిత్తం ఆరు నెలలపాటు మన పులికాట్ పరిసరాల్లో ఉంటాయని, ప్రతి ఏటా ఈ నీటి పక్షుల రాకను 'ఫ్లెమింగో ఫెస్టివల్' పేరిట ఘనంగా వేడుక చేసుకుంటామన్నారు. మూడు రోజుల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచి ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది పక్షి ప్రేమికులు హాజరవడం ఫ్లెమింగోలతో మనకున్న అనుబంధానికి నిదర్శనమన్నారు.

YSRCP s Bhumana Targets Pawan Kalyan Flamingos Get Permanent Residence Why Not Pulasa Fish

మొంథా తుపానుకు ముందు నుంచే ఫ్లెమింగోల రాక మొదలైందని, పెను గాలులు, భారీ వర్షాలకు వాటి స్థావరాలకు ఇబ్బంది కలగకుండా అటవీ శాఖ ఆధ్వర్యంలో తగు చర్యలు చేపట్టామన్నారు. రానున్న మూడు నెలలు ఫ్లెమింగోల రక్షణపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని అటవీ అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు. పులికాట్ ను ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా మార్చేందుకు అనుకూలమైన పరిస్థితులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

YSRCP s Bhumana Targets Pawan Kalyan Flamingos Get Permanent Residence Why Not Pulasa Fish

ఈ సూచనపై స్పందిస్తూ భూమన.. పవన్ మాటలు అభినందనీయమన్నారు. మీ పేరులోనే పవనం, కళ్యాణం రెండు ఉన్నాయని తెలిపారు. సైబీరియా నుంచి వందల ఏళ్ల నుంచి వలస వస్తున్నాయని, వందల కిలోమీటర్లు దూరం ప్రయాణించే పులస చేపల్ని కూడా గోదావరిలో ఉండేట్లుగా శాశ్వత నివాసం కల్పించాలని కోరుతున్నామన్నారు. ఏప్రిల్, మే నెలల్లో శీతల వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకుని రాష్ట్రంలో చల్లదనం శాశ్వతంగా ఉంచాలని కోరుతున్నట్లు తెలిపారు. సనాతన ధర్మపరిరక్షకా మీరు ఇంకా ఎన్నో చేయాలి, ప్రమాదాలు జరగకుండా రోడ్లు, దేవాలయాల్లో ప్రమాదాలు జరగకుండా, మద్యం మత్తులో అనర్థాలు జరగకుండా చూడాలి, మీరు గాల్లో పక్షుల్ని, నీటిలో చేపల్ని మీరు ఆధీనంలో ఉంచుకోవాలనుకోవడం అభినందిస్తున్నా..ప్రకృతి ఆశించే శక్తి మీకు కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా..ఇప్పటికే మీ జ్ఞాన తృష్ణ, ప్రజలకు అర్థం అయ్యిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+