'తల్లికి వందనం'లో జగన్ బాటలోనే కూటమి- సేమ్ టు సేమ్, ఆ ఒక్కటే మినహాయింపు..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ రోజుతో ఏడాది పాలన పూర్తి చేసుకుంది. దీంతో, ఎన్నికల హామీల అమల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలుకు నిర్ణయించారు. ఈ రోజు ఈ పథకం కింద లబ్ది దారులకు నగదు జమ ప్రారంభం కానుంది. ఈ పథకం అమల్లో భాగంగా ఒక్క నిబంధన మినహా అన్నీ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అమ్మ ఒడి పేరుతో అమలు చేసిన విధంగానే ఇప్పుడూ కొనసాగిస్తున్నారు. రాజకీయంగా వైసీపీ ఈ పథకం అమలు పైన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఈ పథకం పైన ఇప్పుడు ఆసక్తి కర చర్చ సాగుతోంది.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమ్మ ఒడి పేరుతో బడులకు వెళ్లే తల్లుల ఖాతాల్లో నగదు జమ పథకం అమలు చేసారు. అయితే, కుటుంబలో ఒక్క విద్యార్ధికే వర్తింపచేసారు. కాగా, కూటమి నేతలు సూపర్ సిక్స్ పేరుతో ఈ పథకానికి తల్లికి వందనం పేరుగా మార్పు చేసి ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పథకం అమలు చేస్తున్న వేళ దాదాపు గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్నే నగదు జమ విషయంలో అమలు చేస్తోంది. ఇదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది. కూటమి నేత లు తాము జగన్ మాదిరి ఎలాంటి కోతలు లేకుండా రూ 15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామని చెప్పుకొచ్చారు.

ysrcp-slams-ap-govt-latest-orders-on-implementation-on-thalli-ki-vandanam-guid

ఇక, ఇప్పుడు అమలు వేళ మాత్రం భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. నాడు జగన్ తల్లికి వందనం లో ఇవ్వాల్సిన రూ 15 వేల్లో టాయిలెట్ల మెయిన్ టెయినెన్స్..స్కూల్ డెవలప్‌మెంట్ ఫండ్ పేరుతో రెండు వేలు మినహాయించి రూ 13 వేలు జమ చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సైతం ఇదే తరహాలో రెండు వేలు మినహాయించి రూ 13 వేలు తల్లికి వందనం పేరు తో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. ఇందు కోసం రాష్ట్రంలో అర్హులుగా గుర్తించిన దాదాపు 67,27,164 మంది విద్యార్ధుల కోసం₹8,745 కోట్లు విడుదల చేసారు. దీని ద్వారా ఒక్కో విద్యార్థి తల్లి ఖాతాలో 13 వేలు జమ కానున్నాయి. ఇక.. విద్యార్ధుల సంఖ్య గురించి వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తాజాగా ఈ పథకం అమలు పైన మార్గదర్శకాలను జారీ చేసింది. తల్లికి వందనం నిధులను ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+