Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీకి అస్త్రాన్ని అందించిన విజయమ్మ- వైసీపీ సంధించిన ప్రశ్నలు

YS Jagan: సార్వత్రిక ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమిని ఎదుర్కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరిన్ని ఇబ్బందుల్లో పడ్డారు. ఒకవంక సీనియర్ నేతలు ఒకరి తరువాత ఒకరుగా పార్టీని వీడుతోండగా.. మరోవంక కుటుంబపరంగా లుకలుకలను ఎదుర్కొంటోన్నారు.

ఆస్తి పంపకాల వ్యవహారంలో వైఎస్ జగన్ కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇది కాస్తా పిటీషన్లు వేసే స్థాయికి వెళ్లింది. గతంలో ఇదే విషయంపై జగన్ చెల్లెలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల- వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అలాంటి ఉదంతాలే జగన్ కుటుంబంలో చోటు చేసుకున్నాయి.

YSRCP slams YS Vijayamma over her letter

ఆస్తుల పంపకాల విషయంలో స్వయానా జగన్ తల్లి వైఎస్ విజయమ్మ సైతం కూతురి వైపే నిలిచారు. షర్మిలకు మద్దతుగా బహిరంగ లేఖను విడుదల చేశారు. కుటుంబపరమైన సున్నితాంశాలను అందులో ప్రస్తావించారు. ఇది తెలుగుదేశం పార్టీకి మరో ఆయుధంలా మారింది.

విజయమ్మ రాసిన లేఖకు వైఎస్ఆర్సీపీ ఎదురుదాడి చేసింది. ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. జగన్‌ను చట్టపరంగా ఇబ్బంది పెట్టడానికి, బెయిల్‌ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని విజయమ్మ ప్రస్తావించకపోవడం సరికాదని, ప్రజలను పక్కదోవపట్టించడమేనని పేర్కొంది.

సరస్వతీ కంపెనీ వాటాల విషయంలో ఈడీ అటాచ్‌మెంట్‌, తెలంగాణ హైకోర్టు స్టేటస్‌-కో ఆదేశాలు ఉన్నప్పటికీ, యాజమాన్యబదిలీ జరిగేలా క్రయవిక్రయాలు చేయకూడదని, అందుకే అటాచ్‌మెంట్‌లో ఉందనే విషయం అందరికీ తెలిసినప్పటికీ, ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకూడదంటూ సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జిల సహా న్యాయసలహాలు ఉన్నప్పటికీ షేర్లను బదిలీ చేసిన మాట వాస్తమే కదా? అంటూ ప్రశ్నించింది.

2024 ఎన్నికల సమయంలో తమ పార్టీని ఇబ్బందిపెట్టేలా వీడియో విడుదల చేసిన విజయమ్మ తాను షర్మిల వైపు ఉన్నాననే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారని వైసీపీ గుర్తు చేసింది. వైఎస్సార్ కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలుచేసేలా ఇలా వ్యవహరించడం ధర్మమేనా? అంటూ నిలదీసింది.

YSRCP slams YS Vijayamma over her letter

తల్లిగా విజయమ్మ మద్దతు సంగతి దేవుడెరుగు, కనీసం తటస్థ వైఖరిని మరిచిపోయి, పక్షపాతం వహించిన వైనం చూసి వైఎస్సార్‌ అభిమానులు తీవ్రంగా కలతచెందారని, బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. జగన్‌‌కు షర్మిల వ్యక్తిగతంగా రాసిన లేఖ టీడీపీ సోషల్‌ మీడియా అకౌంట్‌లో ప్రత్యక్షం కావడం, విజయమ్మ కూడా సంతకం చేసిన ఆ ఉత్తరాన్ని టీడీపీ విడుదల చేయడం ఆమె వైఖరిని ప్రశ్నిస్తున్నాయని తెలిపింది.

జగన్‌‌ను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీయడానికి షర్మిల వేసిన ప్రతి అడుగు కూడా ప్రత్యర్థులకు లబ్ది చేకూర్చేదేనని, మూడు నాలుగేళ్లుగా ఇంత జరుగుతున్నా సహనంతో మౌనంగా ఆ బాధను జగన్‌ అనుభవించారని, ఇలాంటి పరిస్థితుల్లో అసలు బాధితులు ఎవరు? ఒక తల్లిగా విజయమ్మ బాసట ఎవరికి ఉండాలి? అన్న బలమైన ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోందని పేర్కొంది.

జగన్‌ స్వార్జితంలో ఎలాంటి హక్కు లేకపోయినా, ఆ ఆస్తిలో భాగం కావాలని షర్మిల ఇంత రాద్ధాంతం చేయడం ఏంటి?, ఇంత యాగీ చేయడం ఏంటి? ఇన్ని లేఖలు రాయడం ఏంటి? అందులోని లేఖను టీడీపీ విడుదలచేయడం ఏంటని విజయమ్మపై ప్రశ్నల వర్షాన్ని కురిపించింది వైసీపీ.

ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత కుటుంబ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇంకెంత మాత్రం మునిగిపోకూడదని, ప్రజాసమస్యలపై దృష్టి సారిస్తామని ఇదివరకే తమ పార్టీ స్పష్టం చేసిందని గుర్తు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+