వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దికి సతీమణి షాక్ - రెబల్ గా బరిలోకి..!!
ఏపీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటు అధినేతల ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో సీట్లు ఆశించి భంగ పడిన వారు రెబల్స్ గా బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నుంచి అక్కడ దువ్వాడ శ్రీను అభ్యర్దిగా ఉన్నారు. ఆయనకు పోటీగా శ్రీను సతీమణి వాణి రెబల్ గా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. టెక్కలి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య, జడ్పీటీసీ సభ్యురాలు వాణి అనుచరుల వద్ద ప్రకటించారు. ఈ నెల 22న నామినేషన్ వేయబోతున్నట్టు వారితో చెప్పారు. మరోవైపు, దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్టు సమాచారం. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలితో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బంది వస్తోందని వాణి గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో వాణిని టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జిగా వైసీపీ నియమించింది. అయితే, శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటి నుంచీ ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు ముఖ్యనాయకులు ఆమెను నామినేషన్ వేయాలని కోరడంతో బరిలోకి దిగుతున్నట్టు స్పష్టం చేశారని సమాచారం. కొంత కాలం క్రితం వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఆ పార్టీ అధిష్ఠానం వాణిని నియమించింది. వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే వరకు ఆమె క్రియాశీలకంగానే వ్యవహరించారు. శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ వైఖరితో అసంతృప్తిగా ఉన్న ముఖ్య నేతలు నామినేషన్ వేయాలని కోరడంతో బరిలోకి దిగుతున్నట్లు ఆమె స్పష్టం చేయటంతో రాజకీయంగా ఆసక్తి ఏర్పడింది.












Click it and Unblock the Notifications