విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికల్లో పోటీ చేయం: జగన్ పార్టీ, బీటెక్ రవితో బాబు సుదీర్ఘ భేటీ

కార్పోరేషన్ పరిధిలో జరగబోయే ఉప ఎన్నికకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. విజయవాడ నగర కార్పోరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌కు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేద

|
Google Oneindia TeluguNews

విజయవాడ: కార్పోరేషన్ పరిధిలో జరగబోయే ఉప ఎన్నికకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. విజయవాడ నగర కార్పోరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌కు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని వైసిపి నగర అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

చనిపోయిన వ్యక్తుల కుటుంబాలపై పోటీ చేయకూడదని తాము నిర్ణయించామని, అందుకే పోటీ చేయడం లేదని చెప్పారు. 2014 ఎన్నికల్లో గెలుపొందిన టిడిపి కార్పోరేటర్ వీరంకి డాంగే కుమార్ అనారోగ్యంతో 2015లో మృతి చెందారు. దీంతో ఆ డీవిజన్లో ఖాళీ ఏర్పడింది. ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది.

<strong>బెదిరించొచ్చు కానీ, ఇదీ దెబ్బంటే!: చంద్రబాబుకు గట్టి షాకిచ్చేలా జగన్..</strong>బెదిరించొచ్చు కానీ, ఇదీ దెబ్బంటే!: చంద్రబాబుకు గట్టి షాకిచ్చేలా జగన్..

YSRCP will not contest in corporation by elections

ఇదిలా ఉండగా, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టిడిపి సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. కడప జిల్లా నుంచి గెలిచిన బీటెక్ రవి, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికైన మాధవ్‍‌లు చంద్రబాబుతో భేటీ అయ్యారు.

భేటీలో పలు విషయాలపై చర్చించారు. బీటెక్ రవితో చంద్రబాబు సుమారు అరగంట పాటు మాట్లాడారు. అయనను అభినందించారు. టిడిపి - బిజెపి జోడీకి ప్రజల నుంచి మద్దతు ఉందనేందుకు తన విజయమే తార్కానమని సీఎం చంద్రబాబుతో మాదవ్ అన్నారు.

English summary
YSRCP Vijayawada city leader Vellampalli Srinivas said that they will not contest in corporation by elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X