వైఎస్ జగన్ రీసౌండ్ మామూలుగా లేదుగా..: టీడీపీ చిత్తు

అమరావతి: రాష్ట్రంలో పలు పంచాయతీలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా వీచింది. మరోసారి ఘన విజయాన్ని అందుకుందా పార్టీ. గ్రామస్థాయిలో తనకు ఉన్న పట్టును నిలుపుకొంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో.. వైసీపీకి అనుకూలంగా ఈ ఫలితాలు వెలువడటం ఆ పార్టీ క్యాడర్‌లో జోష్‌ను నింపింది.

ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బలే తగిలాయి. ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయింది. వైసీపీ దూకుడు ముందు చతికిల పడింది. జనసేన పరిస్థితీ దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఆ పార్టీ మద్దతుదారుడు ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించారు. ఈ ఫలితాలు టీడీపీ, జనసేనను నిరుత్సాహపరిచాయి.

YSRCP

శ్రీకాకుళం జిల్లా- పెదలంకం, అన్నాపురం, భద్రి పంచాయతీలను వైసీపీ గెలుచుకుంది. బొప్పడం పంచాయతీని టీడీపీ గెలుచుకుంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మ పంచాయతీ వైసీపీ వశమైంది. విజయనగరం జిల్లాలోని పీఎస్ఆర్ పురం, కొప్పర్ల, ఓణి అగ్రహారం, పడాల పేట వైసీపీ జెండా ఎగిరింది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు, పెదకోడపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గోడిలంక, ఏలూరు జిల్లాలోని అడవినెక్కలం, వనదూరు, వీరమ్మకుంట, కొంగంచర్ల, ఎన్టీఆర్ జిల్లాలోని పెదమోదుగుపల్లి, దాచవరం, బాపట్ల జిల్లాలోని పవులూరుల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు.

Chandrababu

తిరుపతి జిల్లాలోని అడవికోయంబేడు, కర్నూలు జిల్లాలోని బదినేహల్, నంద్యాల జిల్లాలోని కోటకందుకూరు, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని చలివెందుల, కడప జిల్లాలోని కొలవలిల్లో వైసీపీ మద్దతుదారులు విజయకేతనం ఎగురవేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని బుర్రిపాలెం, పాకల, లింగరాజు అగ్రహారం, అనంతపురం జిల్లాలోని జంగంపల్లి పంచాయతీల్లో టీడీపీ గెలిచింది.

శ్రీకాకుళం జిల్లా బొప్పడం, విజయనగరం జిల్లా లక్ష్మిపేట, అల్లూరి సీతారామరాజు జిల్లా శోభకోట, అనకాపల్లి జిల్లా కోరుప్రోలు, కాకినాడ జిల్లాలోని జార్జిపేట, పశ్చిమ గోదావరి జిల్లా కావలిపురం పంచాయతీలు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. బాపట్ల జిల్లాలోని మున్నంగివారి పాలెం పంచాయతీని జనసేన గెలుచుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+