India vs Nepal : నేపాల్ ఆరంభం అదుర్స్- తడబడి తేరుకున్న భారత్...
ఆసియాకప్ లో భాగంగా నేపాల్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో భారత్ తడబడి తేరుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. నేపాల్ ను ఆరంభంలో కట్టడి చేయడంలో విఫలమైంది. ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్లలో వరుస ఫీల్డింగ్ తప్పిదాలు, క్యాచ్ లు జారవిడిచి నేపాల్ కు అవకాశమిచ్చింది. దీంతో నేపాల్ 20 ఓవర్లలో 100 పరుగుల మార్క్ దాటింది. అయితే సకాలంలో కోలుకున్న భారత్ వరుస వికెట్లు తీసి తిరిగి మ్యాచ్ పై పట్టు సంపాదించింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నేపాల్ కు ఓపెనర్లు ఆసిఫ్ షేక్ , కుశాల్ భుర్టెల్ శుభారంభం అందించారు. వీరికి భారత ఫీల్డర్లు శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వరుసగా క్యాచ్ లు వదిలేయడంతో భారత్ మూడు కీలక అవకాశాలు కోల్పోయింది. మొదటి, రెండవ, ఐదవ ఓవర్లలో ఈ క్యాచ్ లు వదిలేశారు. దీంతో బ్యాటర్లు ఇద్దరూ అవకాశాలను బాగా ఉపయోగించుకున్నారు. వీరిద్దరూ కలిసి మొదటి పవర్‌ప్లేలో 65 పరుగులు జోడించగా, శార్దూల్ ఠాకూర్ 10వ ఓవర్‌లో 38(25) వద్ద కుశాల్ భుర్టెల్‌ను ఔట్ చేసి ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు.

అనంతరం స్పిన్నర్ రవీంద్ర జడేజా 7(17) పరుగుల వద్ద భీమ్ షార్కిని క్లీన్ చేసి నేపాల్ ను రెండో దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత జడేజా వరుసగా రోహిత్ పౌడెల్, కుషాల్ మల్లాను కూడా సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు పంపాడు. దీంతో నేపాల్ 109 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ దాదాపు భారత్ చేతిలోకి వచ్చినట్లయింది. ఓవైపు సహచరుల వికెట్లు పడుతున్నా నిలకడగా పరుగులు రాబట్టిన ఓపెనర్ ఆసిఫ్ మాత్రం అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
మరోవైపు భారత్, నేపాల్ ఈ రెండు జట్లకూ ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ తో ఆడిన మ్యాచ్ ను నేపాల్ చిత్తుగా ఓడిపోగా.. భారత్ కూడా పాకిస్తాన్ తో మ్యాచ్ రద్దుకావడంతో కేవలం ఒక్క పాయింట్ మాత్రమే సాధించింది. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు లీగ్ లో ఆధిక్యం సాధించే అవకాశం ఉంటుంది. ఇరుజట్ల బలాబలాలు చూస్తే మాత్రం భారత్ క్లియర్ విన్నర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవాళ భారత్ గెలిస్తే 3 పాయింట్లు వస్తాయి. నేపాల్ ఓడితే ఇంటికి వెళ్లడం ఖాయం.
-
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications