ఆంటీ మోజులో అరాచకం, భార్యను చంపేసి ఫోటోగ్రాఫర్ డ్రామాలు, ఫోన్ చేసి ఎస్కేప్!

బెంగళూరు/చిత్రదుర్గ: వివాహం చేసుకున్న యువకుడు అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఫోటో గ్రాఫర్, సొంతంగా ఫోటో స్టూడియో పెట్టుకున్న వ్యక్తి అతని స్టూడియోకి వస్తున్న అమ్మాయిల మీద కన్ను వేశాడు. ఇదే సమయంలో కిలాడీ లేడీ ఫోటో గ్రాఫర్ కు పడిపోవడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన మరియస్వామి అనే వ్యక్తి ఆరు సంవత్సరాల క్రితం రోజా (28) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న మరియస్వామి, రోజా దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఇద్దరు పిల్లలు పుట్టారు. సొంత ఇంటిలో భార్య రోజాతో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి మరియస్వామి నాలుగు సంవత్సరాల క్రితం వరకు చాలా సంతోషంగా కాపురం చేశాడు.

A husband who killed his wife due to illicit relationship and escaped in Chitradurga in Karnataka

చిత్రదుర్గాలో సొంతంగా ఫోటో స్టూడియో పెట్టుకున్న మరియస్వామి శుభకార్యాలు, వివాహాలకు ఫోటోలు, వీడియోలు తీస్తూ డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. స్టూడియోకు వచ్చి వెలుతున్న అమ్మాయిలు, వివాహిత మహిళలతో మరియస్వామి చాలా చనువుగా ఉంటున్నాడు. వలలో పడిన అమ్మాయిలు, ఆంటీలతో మరియస్వామి జల్సా చేస్తున్నాడు.

ఓ వివాహిత మహిళ కూడా మరియస్వామిని వలలో వేసుకుంది, భార్య రోజాకు తెలీకుండా ఓ ఏడాది నుంచి మరియస్వామి అతని ప్రియురాలితో విహారయాత్రలు తిరుగుతూ మస్త్ మజా చేస్తున్నాడు. భర్త మరియస్వామి అక్రమ సంబంధం మ్యాటర్ అతని భార్య రోజాకు తెలిసిపోవడంతో ఇంటిలో గొడవలు మొదలైనాయి. పెద్దలు రాజీ చేసినా మరియస్వామి అతని ప్రియురాలిని వదలకుండా ఆమెతోనే తిరుగుతున్నాడు.

ఇదే విషయంలో రోజా ఇంట్లో పెద్ద గొడవపెట్టుకుంది. మహిళ మోజులో పడిపోయిన మరియస్వామి అతని భార్య రోజాను గొంతు నులిమి చంపేశాడు. నా భార్య ఉరి వేసుకుందని చెప్పి ఆమెను చిత్రదుర్గ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే రోజా చనిపోయిందని వైద్యులు చెప్పారు. నా భార్య ఆత్మహత్య చేసుకుందని రోజా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన మరియస్వామి ఆసుపత్రిలో భార్య శవం వదిలేసి పరారైనాడు.

చాలాకాలం నుంచి రోజాను ఆమె భర్త మరియస్వామి చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, మేము ఎన్ని పంచాయితీలు చేసినా అతను పద్దతి మార్చుకోలేదని, ఇప్పుడు నా చెల్లిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని రోజా అక్క చిత్రదుర్గ మహిళా పోలీసు కేసు పెట్టింది. భార్య రోజాను హత్య చేసిన మరియస్వామి తప్పించుకుని పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని చిత్రదుర్గ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+