Bengaluru: ఆంధ్రా ఐఏఎస్ అధికారి భార్య మీద ఎఫ్ఐఆర్, ఐటీ హబ్ లో జెలిటెన్ స్టిక్స్ తో ? సోము !
అక్రమంగా పేలుడు పదార్థాలు ఉపయోగించారని ఆంధ్రా ఐఏఎస్ అధికారి భార్య మీద కేసు నమోదు కావడంతో ఫోరెన్సిక్ నిపుణులు, బాంబు నిర్వీర్యదళం సిబ్బంది ఎంట్రీ ఇచ్చారు.
బెంగళూరు: ఐఏఎస్ అధికారి భార్య మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. పాఠశాల కట్టడం నిర్మాణం కోసం పునాది వేస్తున్న సమయంలో బయపడిన పెద్ద బండ పేల్చడానికి అక్రమంగా పేలుడు పదార్థాలు ఉపయోగించారని ఐఏఎస్ అధికారి భార్య మీద కేసు నమోదు కావడంతో ఫోరెన్సిక్ నిపుణులు, బాంబు నిర్వీర్యదళం సిబ్బంది ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్న ఆయన భార్య మీద కేసు నమోదు అయ్యిందని బెంగళూరు పోలీసులు అంటున్నారు.

స్కూల్ భవనం నిర్మాణం
బెంగళూరు నగరంలోని అన్నపూర్ణేశ్వరినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమశేఖర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఈయన ఇంటి పక్కన స్కూల్ భవనం నిర్మాణం కోసం పునాది వెయ్యడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో భూమిలో పునాది వేసే చోట పెద్ద బండరాయి బయటపడటంతో దానిని తొలగించడానికి ఆ స్థలం యజమాని ప్రయత్నించారని తెలిసింది. బండరాయి తొలగించడానికి వీలు కాకపోవడంతో కొందరు కార్మికులు ఎంట్రీ ఇచ్చారు.

కేసు పెట్టిన పక్కింటి వ్యక్తి
మార్చి 8వ తేదీన మా ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పునాది వెయ్యడానికి ప్రయత్నించారని, ఆ సందర్బంలో బండరాయి బయటపడటంతో దానిని జిలిటెన్ స్టిక్స్ తో పేల్చేశారని సోమశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా జిలిటెన్ స్టిక్స్ ఉపయోగించి బండరాయి పేల్చడంతో మా ఇంటి గోడలు బీటులువాలాయని సోమశేఖర్ అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

ఐఏఎస్ అధికారి భార్య మీద ఎఫ్ఐఆర్
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. స్థానికులను విచారణ చెయ్యగా ఆ రోజులు పెద్దపెద్ద శభ్దాలు వచ్చాయని, పేలుడు సంభవించిందని స్థానికులు చెప్పారని పోలీసులు అన్నారు. ఓ ఐఏఎస్ అధికారి భార్య ఈ ప్రాంతంలో స్కూల్ భవనం నిర్మించడానికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా జిలిటెన్ స్టిక్స్ ఉపయోగించారని వెలుగు చూడటంతో ఆమె మీద కేసు నమోదు చేశామని బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు కన్నడ మీడియాకు చెప్పారు.

ఆంధ్రాలో ఐఏఎస్ అధికారి
స్కూల్ భవనం నిర్మించడానికి ప్రయత్నించిన మహిళ భర్త ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్నారని పోలీసులు చెప్పారని కన్నడ మీడియా తెలిపింది. ఫోరెన్సిక్ నిపుణులు, బాంబు నిర్వీర్యదళం సిబ్బందితో సంఘటనా స్థలంలో పరిశీలించి ఆధారాలు సేకరించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. జిలిటెన్ స్టిక్స్ ఎక్కడి నుంచి తెప్పించారు ?, అనుమతి లేకుండా బెంగళూరులో వాటిని ఎందుకు పేల్చారు అని ఆరా తీస్తున్నామని అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు తెలిపారు. అయితే ఆ ఐఏఎస్ అధికారి పేరును కన్నడ మీడియా బయటపెట్టలేదు.












Click it and Unblock the Notifications