తెలుగు ఐఎఎస్ రోహిణి సింధూరికి మరో షాక్- కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
కర్ణాటక కేడర్ కు చెందిన తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి- ఐపీఎస్ అధికారిణి డీ రూప మధ్య తలెత్తిన వివాదాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
బెంగళూరు: కర్ణాటక కేడర్ కు చెందిన తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎస్ అధికారిణి డీ రూపా ముద్గిల్ తో తలెత్తిన వివాదం అనంతరం బదిలీ వేటును ఆమె ఎదుర్కొన్నారు. డీ రూప ముద్గిల్ తో వివాదం తలెత్తిన నేపథ్యంలో- ఆ ఇద్దరినీ బదిలీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. దేవాదాయ శాఖ కమిషనర్ ఉన్న రోహిణి సింధూరిపై బదిలీ వేటు వేసింది. ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. వెయిటింగ్ లో ఉంచింది.

బదిలీ తరువాత..
ఇదే వివాదంలో ఐపీఎస్ అధికారిణి డీ రూపను కూడా కర్ణాటక ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న రూప ముద్గిల్ ను ఆ హోదా నుంచి తప్పించింది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ క్రమంలో డీ రూప భర్త, ఐఎఎస్ అధికారి మునీశ్ మౌద్గిల్ ను కూడా బదిలీ చేసింది బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం. సర్వే సెటిల్ మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ గా ఉన్నమునీశ్ ను డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కు పంపించింది.

అక్కడితో ఆగలేదు..
పరస్పర ఆరోపణలు, విమర్శలు-ప్రతి విమర్శలతో రోజూ వార్తల్లో నిలుస్తోన్న రోహిణి సింధూరి, రూప ముద్గిల్ వ్యవహారాన్ని కర్ణాటక ప్రభుత్వం బదిలీలతో సరిపెట్టట్లేదు. వారిద్దరిపైనా శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందిత శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు సివిల్ సర్వెంట్స్ మహిళా అధికారులు- డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) రూపొందించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రభుత్వం భావిస్తోంది.

సమగ్ర నివేదిక..
రోహిణి సింధూరి- రూప ముద్గిల్ వివాదంపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశించారు వందిత శర్మ. రోహిణి సింధూరిపై రూప చేసిన ఆరోపణలు, ఆమె ప్రైవేట్ ఫొటోలను రోహిణి సింధూరి తన తోటి సివిల్ సర్వీసెస్ అధికారులకు షేర్ చేసినట్లు వచ్చిన వార్తలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. దీనికోసం ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక అందిన తరువాత ఇద్దరిపైనా శాఖాపరమైన చర్యలను తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

పరువునష్టం దావా..
ఈ వివాదం తరువాత రోహిణి సింధూరి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డీ రూపపై పరువునష్టం దావా వేశారు. ఏకంగా కోటి రూపాయలను చెల్లించడంతో పాటు- బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. రూపతో పాటు 66 మందికి సమన్లను జారీ చేసింది. న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.
-
"మేము VIPs.. ప్రతి ఎమ్మెల్యేకు 5 ఐపీఎల్ టికెట్స్.. సెపరేట్ సీటింగ్" -
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications