Lovers: అనుమానాస్పద స్థతిలో శవమైన ప్రియుడు, శవాన్ని కాల్చి బూడిద చేశారు, ఉరి వేసుకున్న ప్రియుడు!

బెంగళూరు/చామరాజనగర్: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఒకే గ్రామంలో ఉన్న ప్రేమికులు ప్రతిరోజు కలుసుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరుకావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి ధైర్యంలేని ప్రేమికులు కుమిలిపోయారు. ఇదే సమయంలో ప్రియురాలు అనుమానాస్పదస్థితిలో మరణించడం, ఆమె శవాన్ని కాల్చి బూడిద చెయ్యడం జరిగిపోయింది. ఆవేదనతో ప్రియుడు కూడా ఆత్మహత్యాయత్నం చెయ్యడం అనేక అనుమానాలకు దారితీసింది.

కర్ణాటకలోని చామరాజనగర సమీపంలోని కాగవాడిమోళే ప్రాంతంలో సుమిత్రా అనే యువతి నివాసం ఉంటున్నది. సుమిత్రా నివాసం ఉంటున్న గ్రామంలోనే పోమేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొంతకాలం నుంచి సుమిత్రా, సోమేష్ ప్రేమించుకున్నారు.

Lovers: Many suspect behind death of young woman near Chamarajanagar in Karnataka.

ఒకే గ్రామంలో ఉన్న ప్రేమికులు సుమిత్రా, సోమేష్ ప్రతిరోజు కలుసుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరుకావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి ధైర్యంలేని ప్రేమికులు సుమిత్రా, సోమేష్ ఇంటి నుంచిపారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

ఇదే సమయంలో సుమిత్రా ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది. మా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పిన కుటుంబ సభ్యులు ఆమె శవాన్ని కాల్చి బూడిద చేసేశారు. ప్రియురాలు సుమిత్రాను ఆమె కుటుంబ సభ్యులు చంపేశారని సోమేష్ అతని స్నేహితుల దగ్గర విలిపించారు. ప్రియురాలు అనుమనాస్పదస్థతిలో మరణించిన కొన్ని రోజులకే సోమేష్ ఆత్మహత్యాయత్నం చేశారు. కేసు నమోదు చేసి సుమిత్రా కుటుంబ సభ్యులను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని చామరాజనగర జిల్లా ఎస్పీ శివకుమార్ మీడియాకు చెప్పారు. సుమిత్రా పరువు హత్యకు గురైయ్యిందా ? లేక ఆమె నిజంగా ఆత్మహత్య చేసుకుందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+