రిజర్వేషన్లు, దుమ్ములేపుతున్న బంజారాలు, అధికార పార్టీ లీడర్స్ కు ?, 144 సెక్షన్ టైమ్ లో !
బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటకలో కులాల రిజర్వేషన్ల చిచ్చు హింసకు దారితీస్తోంది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బంజారాల ఆందోళన ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది. ఇప్పటికే మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ఇంటి మీద బంజారాలు దాడులకు పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం రహదారలు నిర్బంధించిన బంజారాలు రోడ్డ మీద టైర్లు వేసి నిప్పు పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
రిజర్వేషన్ల విషయంలో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడిందని బంజారాలు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్, యడియూరప్పను టార్గెట్ చేసుకున్న బంజారాలు సోమవారం శివమొగ్గ జిల్లాలోని శికారిపురలో ఆయన ఇంటి మీద రాళ్ల వర్షం కురిపించి దాడులు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసులు లాఠీచార్జ్ చేసి బంజారాలను చితకబాదేశారు. పరిస్థితులు చెయ్యిదాటిపోతాయని బావించిన పోలీసులు శికారిపురలో సోమవారం మద్యాహ్నం నుంచి 144 సెక్షన్ విధించారు. అయితే 144 సెక్షన్ అమలులో ఉన్నా లెక్కచెయ్యకుండా మంగళవారం బంజారాలు శికారిపురలోని రోడ్ల మీదకు వేలాది మంది చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చిన బంజారాలు అన్ని వైపుల రహదారులు అన్ని నిర్బంధించారు.
రోడ్ల మీద టైర్లు వేసి నిప్పంటించిన బంజారాలు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో బీజేపీ జెండాలకు పీకేసి రోడ్ల మీదకు విసిరేశారు. రిజర్వేషన్ల విషయంలో మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం చివరికి తక్కువ రిజర్వేషన్లు ఇచ్చి మాకు ద్రోహం చేసిందని బంజారాలు ఆరోపించారు.
మంగళవారం శికారిపురతో పాటు కర్ణాటకలోని బాగల్ కోటేలో బంజారాలు రోడ్ల మీదకు వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంజారాల ఆందోళనను ఓట్లుగా మాలుచుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొత్తం మీద కర్ణాటకలో బంజారాల ఆందోళనలు ఎన్నికల సమయంలో బీజేపీకి పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది.












Click it and Unblock the Notifications