ఫిబ్రవరి 1న బడ్జెట్: కార్పొరేట్లు, మార్కెట్ వర్గాల ఆకాంక్షలు నెరవేరేనా?

Recommended Video

    Budget 2018 Expectations : ఫిబ్రవరి 1న బడ్జెట్: ఆకాంక్షలు నెరవేరేనా?

    ముంబై: సామాన్యులు.. కార్పొరేట్లు, స్టాక్ మార్కెట్లు.. వివిధ పారిశ్రామిక రంగాలు ఎదురుచూస్తున్న బడ్జెట్.. అందునా ఎన్నికల ముంగిట విత్త మంత్రి అరుణ్ జైట్లీ వచ్చేనెల ఒకటో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ పారిశ్రామిక రంగాలు, ప్రముఖులు, ఆర్థిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలు తమకు తాయిలాలు ప్రకటించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. పెట్టుబడుల పెంపునకు మార్గం సుగమం చేయాలని ఇన్వెస్టర్లు కోరుతున్నారు. దేశ ప్రగతికి చుక్కాని అయిన వ్యవసాయంతోపాటు వ్యాపార అభ్యున్నతి కోసం రాయితీలు ప్రకటించాలని ఆశిస్తున్నారు. 2016 నవంబర్ 8వ తేదీన నోట్ల రద్దు, గతేడాది జూలై ఒకటో తేదీన ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వల్ల తలెత్తిన ప్రతికూల ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్రుద్ధిరేటు 6.75శాతంగా నమోదవుతుందని అంచనా వేశారు. ఇది గత మూడేళ్లలో అతి తక్కువ జీడీపీ వ్రుద్ధిరేటుగా నమోదైంది.

    ఈ నేపథ్యంలో జాతి ఆర్థిక, సామాజిక ప్రగతి పరుగులు పెట్టే దిశగా జీడీపీకి పూర్వ వైభవం సాధించే దిశగా విత్త మంత్రి అరుణ్ జైట్లీ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. మరోవైపు ద్రవ్యలోటు లక్ష్యాలు చేరుకోగలమా? అని ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. అదే జరిగితే లక్ష్యాలను ఛేదించడానికి బాండ్లు విక్రయించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లు, కార్పొరేట్ల అంచనాలు, ఆకాంక్షలు ఒకసారి పరిశీలిద్దాం..

    వ్యక్తిగత ఐటీ మినహాయింపులు పెంపునకు అప్పీళ్లు

    వ్యక్తిగత ఐటీ మినహాయింపులు పెంపునకు అప్పీళ్లు

    కార్పొరేట్ సంస్థల పెట్టుబడుల ఆధారంగా లభించే లాభాలపై విధించే కార్పొరేట్ పన్ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని కార్పొరేట్లు ఆశిస్తున్నారు. దీంతోపాటు కనీస ప్రత్యామ్నాయ పన్నును 18.5 నుంచి 15 శాతానికి తగ్గించాలని మరో అభ్యర్థన. టాక్స్ డిడక్షన్లు విస్తరించి.. వ్యక్తిగత ఆదాయ మినహాయింపులు పెంచాలన్నది ఇంకొక అభ్యర్థన. పెట్టుబడుల్లో దీర్ఘకాలిక పెట్టుబడుల లాభాలపై పన్ను

     సాగునీటి రంగానికి నిధులు పెంచాలి

    సాగునీటి రంగానికి నిధులు పెంచాలి

    వ్యవసాయ రంగంలో ప్రోత్సాహం కోసం రుణ పరపతికి హామీ కోసం ఫండ్ ఏర్పాటు చేయాలి. పంటల బీమా పథకాల కోసం అధిక నిధులు కేటాయించాలి. సూక్ష్మ సాగునీటి పరిశ్రమల నిర్మాణంతోపాటు రిజర్వాయర్లు, కాలువల నిర్మాణానికి నిధుల పెంపు. వ్యర్థాల నివారణకు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ల నిర్మాణానికి సబ్సిడీల కొనసాగింపు. రసాయన ఎరువులపై సబ్సిడీలు తగ్గించాలి.

     మౌలిక వసతులకు నిధుల కేటాయింపులు పెంచాలి

    మౌలిక వసతులకు నిధుల కేటాయింపులు పెంచాలి

    మొండి బకాయిలపై పూర్తిస్థాయి టాక్స్ డిడక్షన్ అనుమతించాలి. బ్యాంకుల్లో రూ. 10 వేల డిపాజిట్లపై వడ్డీ మినహాయించాలి. రిటైల్ టర్మ్ డిపాజిట్లపై ఐదేళ్ల నుంచి మూడేళ్లకు పన్ను మినహాయింపు. ఇన్ సాల్వెన్సీ కోడ్ కింద పన్ను మినహాయింపు. ఇదిలా ఉంటే గత బడ్జెట్‌తో పోలిస్తే వచ్చే బడ్జెట్లో 10 - 15 శాతం పెట్టుబడుల పెంపు. పశ్చిమ, తూర్పు భారత ప్రాంతాలను అనుసంధానించే భారతమాల ప్రాజెక్టుతోపాటు కీలక రోడ్డు నిర్మాణ ప్రాజెక్టు పూర్తి మద్దతు ఇవ్వాలి. రైల్వే శాఖకు 10 శాతం పెట్టుబడులు పెంచాలి.

     మొబైల్, ట్యాబ్ లపై పన్ను హేతుబద్ధీకరించాలి

    మొబైల్, ట్యాబ్ లపై పన్ను హేతుబద్ధీకరించాలి

    డిజిటల్ లావాదేవీలపై భారీగా మినహాయింపులు ఇవ్వాలి. డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతుల కల్పనకు మద్దతు ఇవ్వాలి. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ కంప్యూటర్లపై ఎక్సైజ్ డ్యూటీ, పన్నుల వ్యవస్థను హేతుబద్ధీకరించాలి. ఐటీ, టెక్నాలజీ రంగాలతోపాటు టెలికం సర్వీసులపై ప్రస్తుతం అమలులో ఉన్న 18 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి కుదించాలి.

     విద్యుత్ వాహనాలపై జీఎస్టీ తగ్గించాలని అభ్యర్థన

    విద్యుత్ వాహనాలపై జీఎస్టీ తగ్గించాలని అభ్యర్థన

    15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలను రోడ్లపై నడుపకుండా వాటిని ధ్వంసం చేయాలి. విద్యుత్ వాహనాలపై ప్రస్తుతం అమలులో ఉన్న జీఎస్టీ తగ్గించాలని ఆకాంక్ష.

     చౌక ధరకు ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలి

    చౌక ధరకు ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలి

    అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్ విండో ద్వారా ఇవ్వాలి. హౌసింగ్ ప్రాజెక్టుల్లో జాప్యం నివారణకు ప్రత్యేక పర్యవేక్షణ జరపాలి. రియల్ ఎస్టేట్ రంగానికి మౌలిక వసతుల హోదా కల్పించాలి. తద్వారా ఫైనాన్స్, ప్రాజెక్టు వ్యయం తగ్గింపునకు వీలవుతుంది. తద్వారా ప్రజలకు చౌకగా అందుబాటులోకి తేవాలి. ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులపై ప్రస్తుతం అమలులో ఉన్న 12 శాతం జీఎస్టీని తగ్గించాలి. చౌక ఇళ్ల నిర్మాణానికి అధిక నిధులు కేటాయించాలి. ఇళ్ల కొనుగోళ్లపై 12 శాతం జీఎస్టీ తగ్గించాలి. స్టాంప్ డ్యూటీ కూడా తగ్గించాలి.

    లోహాలు అండ్ మైనింగ్ రంగాల కస్టమ్స్ భారం తగ్గించాలి

    లోహాలు అండ్ మైనింగ్ రంగాల కస్టమ్స్ భారం తగ్గించాలి

    ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి, అన్వేషణ ప్రాజెక్టులపై విధించిన ‘సెస్' 20 శాతం నుంచి 8 - 10 శాతానికి తగ్గించాలి. సహజ వాయువుపై మరింత ప్రయోజనకరమైన జీఎస్టీ అమలు చేయాలి. సిటీ గ్యాస్ పంపిణీ సంస్థలపై ఎక్సైజ్ సుంకం తగ్గించాలి. ఎల్ఎన్జీ దిగుమతులపై బేసిక్ కస్టమ్స్ సుంకం మినహాయింపునివ్వాలి. ఎల్పీజీ, కిరోసిన్ విక్రయిస్తున్న కంపెనీలకు సబ్సిడీ కల్పించాలి. ఇక గ్రేడ్లవారీ బొగ్గుపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించాలి. ఐరన్ ఓర్ ఎగుమతులపై ఎక్స్ పోర్ట్ సుంకం తగ్గించాలి. దేశీయ పరిశ్రమను పరిరక్షించేందుకు అల్యూమినియం స్ర్కాప్ దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ సుంకం పెంచాలి. ఖనిజాల అన్వేషణ వేగవంతం చేయాలి. ఇక అరుదైన పసిడి స్మగ్లింగ్ నివారణకు ప్రస్తుతం అమలులో ఉన్న 10 శాతం దిగుమతి సుంకాన్ని రెండు నుంచి నాలుగు శాతానికి తగ్గించాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+