ప్రతిపాదిత వృద్ధి లక్ష్యాల సాధన సందేహమే: ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ పెదవి విరుపు

చెన్నై: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన బడ్జెట్ 'వివిధ వర్గాల ఆందోళనలు' ప్రతిబింబిస్తున్నా పూర్తిస్థాయిలో చోటు కల్పించలేదని ప్రముఖ ఆర్థిక వేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ చైర్మన్ సీ రంగరాజన్ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్రుద్ధిరేటు నెమ్మదించిన తీరు, దేశ అవసరాల స్థాయికి రాని ప్రైవేట్ పెట్టుబడులు, వ్యవసాయ రంగంలో నిరాశానిస్ప్రుహలు దేశ ప్రజలను వెంటాడుతున్నాయని పేర్కొన్నారు.

Recommended Video

    Union Budget 2018 TAX, GDP, Reforms on Agenda | Oneindia Telugu

    బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే దిశగా వ్యవసాయ రంగంలో అన్నదాతల నిరాశానిస్ప్రుహలు ప్రతిబింబించినా. వాటిని అందుబాటులోకి తేవడం ఎలా? అన్న ప్రశ్న వెంటాడుతున్నదన్నారు. బడ్జెట్ ప్రతిపాదిత వృద్ధి సాధించడం ప్రశ్నార్థకమేనని తేల్చేశారు. కేవలం పెట్టుబడులకు అనుకూల వాతావరణం మెరుగు పడినా కొద్దీ ఈ లక్ష్యాలు సాధించడం వీలవుతుందని రంగరాజన్ స్పష్టం చేశారు.

    ఆకాంక్షకలనుగుణంగానే వ్యవసాయం, విద్యా వైద్య రంగానికి కేటాయింపు

    ఆకాంక్షకలనుగుణంగానే వ్యవసాయం, విద్యా వైద్య రంగానికి కేటాయింపు

    ఆకాంక్షలకు అనుగుణంగానే వ్యవసాయ, విద్యావైద్య రంగాలకు కేటాయింపులు, ద్రవ్యలోటు నియంత్రణ ప్రభుత్వానికి కత్తిమీద సాము వంటిదే ప్రస్తుతం బడ్జెట్ ప్రతిపాదనల్లో వ్యవసాయం, ఆరోగ్యం, విద్యారంగాల బలోపేతానికి ఎక్కువ కేటాయింపులు చేయడం అత్యంత ఆకాంక్షాపరమైన మార్గంలో సాధించిన మార్పులని రంగరాజన్ అంగీకరించారు. కానీ రెండు అంశాల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయని రంగరాజన్ అభిప్రాయ పడ్డారు. ‘అందులో ఒక అంశం ద్రవ్యలోటు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యానికి చేరుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఆర్థిక సంవత్సరం మరింత ద్రవ్యలోటు పెరిగే అవకాశం ఉన్నది' అని రంగరాజన్ వ్యాఖ్యానించారు. ద్రవ్యలోటు నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న విశ్వసనీయమైన చర్యలేమిటన్నది ప్రశ్నార్థకంగా మారిందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇక ముందు ఇలాగే ద్రవ్యలోటు లక్ష్యాలను చేరుకోవడంలో వెనుక పడటం అలవాటుగా చేసుకోవద్దని హెచ్చరించారు.

    ప్రభుత్వ పథకాలకు నిధుల వినియోగం ఎలా?

    ప్రభుత్వ పథకాలకు నిధుల వినియోగం ఎలా?

    ఇక బడ్జెట్‌లో నేరుగా పెట్టుబడులను ఆకర్షించే దిశగా తీసుకున్న చర్యలేమీ లేవని రంగరాజన్ తేల్చి చెప్పారు. ‘నూతన పెట్టుబడుల ద్వారా మాత్రమే ఉద్యోగాలు కల్పించడం సాధ్యమవుతుంది. ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి మార్గం సుగమం అవుతుంది' అని చెప్పారు. వ్యయ కేటాయింపులు బాగానే ఉన్నా, ద్రవ్యలోటు పతనం కావడమే ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. కొన్ని పథకాలకు నిధుల వ్యయంపై ఒకింత స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఇందులో జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం ఒకటని రంగరాజన్ గుర్తు చేశారు. జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం ఎలా నిర్వహిస్తారన్న విషయం ఇప్పటికీ స్పష్టత రాలేదన్నారు. ఇదేమైనా బీమా పథకమా? అని ప్రశ్నించారు. దానికి ఎంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. పది కోట్ల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ కల్పిస్తున్నందున ఇది అత్యంత వ్యయ భరితమైన పథకంగా మారనున్నదని చెప్పారు.

     ఎంఎస్పీ కంటే మార్కెట్‌లో పంటల ధర తక్కువ

    ఎంఎస్పీ కంటే మార్కెట్‌లో పంటల ధర తక్కువ

    బొగ్గు, ఇనుము, ఉక్కు రంగాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు రావడం లేదు. ఇటువంటప్పుడు ఏ ప్రాతిపదికన పెట్టుబడులను సేకరిస్తారన్న విషయమై స్పష్టత తేవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయ పడుతున్నారు. మొత్తం పెట్టుబడుల సమీకరణే ప్రధానంగా మారుతుందన్నారు. పెట్టిన పెట్టుబడులకు తగిన ఆదాయం లభించక, గిట్టుబాటు ధరలు లభించక రైతులు నిరాశానిస్ప్రుహల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారని గుర్తు చేశారు. పంటలకు తగిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లభించడం మాత్రమే సమస్య కాదని రంగరాజన్ అభిప్రాయ పడ్డారు. ప్రతి పంటకూ మార్కెట్‌లో ఎంఎస్పీ కంటే తక్కువ ధర పలుకడమే అసలు సమస్య అని తేల్చేశారు.

    రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా రైతులకు పంటల ధర చెల్లింపు ఇలా

    రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా రైతులకు పంటల ధర చెల్లింపు ఇలా

    రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న సమస్యను ఎలా ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందన్నదే ప్రశ్న అని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలకు ఎంఎస్పీకి, వ్యాపారులు మార్కెట్లలో పెడుతున్న ధరకు మధ్య తేడాను తగ్గించడానికి తమ ఖజానా నుంచి వివిధ రకాల ధరలు చెల్లిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పంటల సేకరణకు శ్రీకారం చుడుతుందా? అని ప్రశనించారు.

     సమస్యలకు పరిష్కారం ఎప్పుడో సర్కార్ చెప్పాలి

    సమస్యలకు పరిష్కారం ఎప్పుడో సర్కార్ చెప్పాలి

    ఇక గతేడాది జూలై నుంచి అమలులోకి తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) గురించి బడ్జెట్ ప్రతిపాదనల్లో ఊసే లేదని రంగరాజన్ అభిప్రాయ పడ్డారు.. రెవెన్యూ తగ్గుముఖం పట్టడానికి జీఎస్టీ కాదని ప్రభుత్వం దాటవేస్తున్నదని అన్నారు. కేవలం 11 నెలల ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని తెలిపిందన్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత తలెత్తిన సమస్యల పరిష్కారానికి బడ్జెట్ ప్రతిపాదనలో చేర్చనే లేదని, సమీప భవిష్యత్ లోనైనా ఆ పని చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+