కుప్పకూలిన బంగారం ధరలు! తులం బంగారం ఎంతంటే..

గత నాలుగు రోజులుగా వరుసగా పెరుగుతూ భయపెట్టిన పసిడి ధరలు ఇవాళ ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు దేశీయంగా మారిన పరిణామాల నేపథ్యంలో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా క్షీణించాయి. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు భారీగా దిగిరావడంతో కొనుగోలుదారులకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశంగా మారింది.

భాగ్యనగర బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 2,240 తగ్గి రూ. 1,60,090 వద్దకు చేరింది. అటు ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ. 2,050 దిగివచ్చి రూ. 1,46,750 పలుకుతోంది. ఒక్కరోజులోనే ఈ స్థాయిలో ధరలు తగ్గడం గత కొద్ది కాలంలో ఇదే మొదటిసారి. కిలో వెండి ధర మాత్రం స్థిరంగా రూ. 3,14,900 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.3,14,900 వద్ద కొనసాగుతోంది.

Gold Prices Crash 24K Gold Drops by Rs 2240 to Rs 160090 Check Hyderabad and Chennai Rates on May 15
30 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గోల్డ్ ఇంపోర్ట్స్!
30 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గోల్డ్ ఇంపోర్ట్స్!

గ్రాము ధరల వివరాలు..

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, 1 గ్రాము 24 క్యారెట్ల పసిడి ధర రూ. 16,009 (రూ. 224 తగ్గుదల) వద్ద ఉండగా, 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 14,675 (రూ. 205 తగ్గుదల) వద్ద ఉంది. ఇక 18 క్యారెట్ల ధర రూ. 12,007గా నమోదైంది. సాధారణంగా ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన మార్గంగా భావిస్తారు, అయితే నేటి ధరల క్షీణత మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

ఏడాది పాటు గోల్డ్ కొనకపోతే దేశానికి ఏమవుతుంది? మోదీ మాస్టర్ ప్లాన్!
ఏడాది పాటు గోల్డ్ కొనకపోతే దేశానికి ఏమవుతుంది? మోదీ మాస్టర్ ప్లాన్!

దేశవ్యాప్తంగా నగరాల వారీగా..

దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే చెన్నైలో బంగారం ధరలు అత్యధికంగా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,63,090 గా ఉండగా, 22 క్యారెట్లకు రూ. 1,49,500 పలుకుతోంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో హైదరాబాద్‌కు సమానంగా ధరలు ఉండగా, ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ. 1,60,240 గా నమోదైంది. వడోదర, అహ్మదాబాద్ నగరాల్లో ఈ ధర రూ. 1,60,140 వద్ద ఉంది.

బంగారం ధరలు తగ్గడం శుభసూచకమని వినియోగదారులు భావిస్తుండగా, వివాహాది శుభకార్యాల సీజన్ నేపథ్యంలో ఈ ధరల పతనం అమ్మకాలపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+