ఆదివారం తగ్గిన బంగారం ధరలు ..కొనాలంటే కొనేయండి ..!

సెప్టెంబర్ 21వ తేదీన బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ప్రేమికులకు ఇది కొంత ఊరటనిచ్చినప్పటికీ, గత కొంతకాలంగా రికార్డు స్థాయికి చేరుకుంటున్న ధరలతో వినియోగదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,790 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,03,200 పలికింది. కేజీ వెండి ధర రూ. 1,34,100గా నమోదైంది. ఈ ధరలు ఆల్ టైం రికార్డు స్థాయి కన్నా కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, పరిస్థితిని చూస్తే ఇవి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనిస్తున్న నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు భారీగా పెరిగాయి. అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర రికార్డు స్థాయిలో 3700 డాలర్లకు చేరడం దీనికి నిదర్శనం. డాలర్ విలువ పతనం అవుతుండటంతో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. అందుకే పసిడి ధరలు అసాధారణంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ధరల్లో వచ్చిన స్వల్ప తగ్గుదల ప్రాఫిట్ బుకింగ్ కారణంగానే అని నిపుణులు భావిస్తున్నారు.

Gold Rates in september 21th 2025

భారతదేశంలో బంగారం అనేది కేవలం ఒక పెట్టుబడి మాత్రమే కాదు, సంస్కృతిలో భాగం. పండుగలు, శుభకార్యాలకు బంగారు ఆభరణాలు తప్పనిసరి. అయితే, ధరలు అమాంతం పెరగడంతో సాధారణ ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయాలంటే వెనుకాడుతున్నారు. ఈ కారణంగా నగల దుకాణాలకు వచ్చే కస్టమర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని యజమానులు చెబుతున్నారు. బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా అనే ప్రశ్న చాలామందిలో ఉన్నప్పటికీ, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు చూస్తే ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+