Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Income Tax ఝలక్: వేల కోట్ల ఆస్తుల గుట్టు రట్టు!

విదేశాల్లోని రహస్య ఆస్తులపై కన్నేసిన ఆదాయపు పన్ను శాఖ (IT Department), నిబంధనలు ఉల్లంఘించిన బడా వ్యాపార కుటుంబాలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అహ్మదాబాద్, సూరత్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లోని వ్యాపారవేత్తలు వేల కోట్ల రూపాయల విలువైన విదేశీ ఆస్తులను కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

తమ పన్ను రిటర్నులలో ఈ ఆస్తుల వివరాలను వెల్లడించని వారిని టార్గెట్ చేస్తూ, రానున్న నెలల్లో చర్యలు చేపట్టేందుకు ఢిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నోడల్ కార్యాలయం ఆధ్వర్యంలో పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు.

Income Tax Department to Issue Notices to Business Families Over Thousands of Crores in Hidden Foreign Assets

ఆస్తుల గుట్టు రట్టు.: Income Tax

భారతదేశం ఇతర దేశాలతో కుదుర్చుకున్న 'సమాచారం స్వయంచాలక మార్పిడి' (AEOI) ఒప్పందాల ద్వారా ఈ వెల్లడి కాని ఆస్తుల గుట్టు రట్టయింది. విదేశీ బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడుల వివరాలను ఇతర దేశాల ఆర్థిక సంస్థలు ప్రతి ఏటా భారత పన్ను అధికారులకు నివేదిస్తాయి. ఈ డేటాను విశ్లేషించిన ఐటీ శాఖ, 2024-25 సంవత్సరానికి సంబంధించి భారీ మొత్తంలో పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించింది. గతంలో నిర్వహించిన 'నడ్జ్' (NUDGE) ప్రచారం ద్వారా సుమారు 24 వేల మంది పన్ను చెల్లింపుదారులు తమంతట తామే రూ.29,208 కోట్ల విలువైన విదేశీ ఆస్తులను వెల్లడించగా, ఇప్పుడు నోటీసులు అందుకోబోయే వ్యాపార కుటుంబాలపై ఈ ప్రభావం అంతకంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.

క్రిమినల్ చర్యలు..

వారసత్వంగా వచ్చిన ఆస్తులు, గతంలో విదేశాల్లో పనిచేసినప్పుడు తెరిచిన ఖాతాలు.. విదేశీ ఒప్పందాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని చాలామంది రిటర్నులలో చూపడం లేదు. అయితే ఐటీ శాఖ నోటీసులు పంపిన తర్వాత వీటిని వెల్లడిస్తే కఠినమైన జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నల్లధనం నిరోధక చట్టం ప్రకారం, వెల్లడికాని విదేశీ ఆస్తి విలువపై 30 శాతం పన్నుతో పాటు, పన్ను మొత్తానికి మూడు రెట్ల జరిమానా విధిస్తారు. అంతేకాకుండా తీవ్రమైన కేసుల్లో ప్రాసిక్యూషన్ (క్రిమినల్ చర్యలు) ఎదుర్కోవాల్సి వస్తుంది. పన్ను అధికారులు ఆస్తిని గుర్తించిన సమయానికి ఉన్న మార్కెట్ విలువనే పన్ను లెక్కింపునకు ప్రామాణికంగా తీసుకుంటారు.

ఒక ప్రత్యేక పథకం

మరోవైపు, చిన్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. విద్యార్థులు, టెక్ ఉద్యోగులు, తిరిగి వచ్చిన ఎన్నారైలు ఒక కోటి రూపాయల లోపు ఉన్న తమ విదేశీ ఆస్తులను వెల్లడించడానికి ఆరు నెలల సమయం ఇచ్చారు. వీరు 30 శాతం పన్ను, మరో 30 శాతం అదనపు పన్ను చెల్లించి జరిమానా.. ప్రాసిక్యూషన్ నుండి తప్పించుకోవచ్చు. అయితే, విదేశాల్లో భారీ ఎత్తున నల్లధనాన్ని దాచిన బడా వ్యాపార కుటుంబాలకు ఈ వన్-టైమ్ పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+