1KG బంగారం ధర రూ.3 కోట్లు కి వెళ్తుంది..లలితా జ్యువెలర్స్ కిరణ్ షాకింగ్ కామెంట్స్..!

బంగారం కొనాలా... వద్దా... అని ఆలోచిస్తున్నవారికి ఇది కచ్చితంగా షాక్ ఇచ్చే మాటే. రాబోయే రోజుల్లో గోల్డ్ ధరలు ఊహించని స్థాయికి చేరవచ్చని లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు జ్యువెలరీ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇంటర్వ్యూలో యాంకర్ "బంగారం ఎంత వరకు పెరిగే అవకాశం ఉంది?" అని నేరుగా ప్రశ్నించగా... కిరణ్ ఏమాత్రం వెనుకాడకుండా "మూడు కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది" అని స్పష్టం చేశారు. ఈ మాట విన్న వెంటనే స్టూడియోలో ఒక్కసారిగా సైలెన్స్. ఇప్పటివరకు లక్షల్లో మాట్లాడిన బంగారం ధర... కోట్ల దాకా వెళ్లొచ్చనే అంచనాతో అందరూ ఆశ్చర్యపోయారు.

Is Gold Headed for an Unprecedented Boom Lalitha Jewellers Kiran s Rs 3 Crore Prediction Stuns Markets

బంగారం మరియు వెండి ధరలు

ఇంతకే ఆగలేదు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతాయని కిరణ్ తేల్చేశారు. ప్రస్తుతం ఉన్న రేట్లతో పోలిస్తే, రాబోయే కాలంలో వెండి ధరలు 6 నుంచి 7 లక్షల వరకు చేరినా ఆశ్చర్యం లేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్లు, ఆర్థిక అనిశ్చితి, కరెన్సీ విలువల మార్పులు..మొత్తం కలిసి ఈ పెరుగుదలకు కారణమవుతాయని ఆయన అభిప్రాయం.

అయితే ఈ పెరుగుదల ఎప్పుడు మొదలవుతుంది? ఎంత కాలంలో? అనే ప్రశ్నకు మాత్రం స్పష్టమైన టైమ్‌లైన్ చెప్పలేనని కిరణ్ అన్నారు. "ఖచ్చితమైన గడువు చెప్పలేను కానీ... బంగారం ధరలు భయంకరంగా పెరిగే రోజులు ముందున్నాయి" అంటూ ఒక హెచ్చరికలాగా తన మాటలను ముగించారు.

ప్రజల నమ్మకం..

ఇంటర్వ్యూలో ప్రస్తుతం గోల్డ్ సేల్స్ పరిస్థితి గురించీ ఆయన మాట్లాడారు. ధరలు పెరుగుతున్నప్పటికీ, బంగారం మీద ప్రజల నమ్మకం ఏమాత్రం తగ్గలేదని, పెట్టుబడిగా కూడా, సంప్రదాయంగా కూడా గోల్డ్ డిమాండ్ కొనసాగుతూనే ఉందన్నారు.

మొత్తానికి... గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఆలోచించాల్సిన సమయం. ఇన్వెస్ట్‌మెంట్‌గా చూస్తున్నవారికి ఇది పెద్ద సిగ్నల్. బంగారం ధరలు భయపెట్టే రేంజ్‌కి వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి... కానీ కిరణ్ మాటలు మాత్రం ఇప్పుడు మార్కెట్‌లో హీట్ పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+