Jeet Adani:అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి.. 30 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు!
నాగ్‌పూర్:భారతదేశ ఆర్థికాభివృద్ధిలో విదర్భ ప్రాంతం తదుపరి 'ఇంజిన్' కాబోతోందని అదానీ గ్రూప్ డైరెక్టర్ జీత్ అదానీ ఆశాభావం వ్యక్తం చేశారు. విదర్భ కేవలం మహారాష్ట్రకు మాత్రమే కాకుండా, దేశానికే ఒక పారిశ్రామిక, ఆవిష్కరణల కేంద్రంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.'అడ్వాంటేజ్ విదర్భ 2026' వేదికగా విదర్భ రూపురేఖలను మార్చేలా అదానీ గ్రూప్ భారీ ప్రాజెక్టులను వెల్లడించింది.
రూ. 70,000 కోట్లతో 'కోల్ గ్యాసిఫికేషన్' ప్రాజెక్ట్
ఈ సదస్సులో అత్యంత కీలకమైన ప్రకటన ఏమిటంటే.. నాగ్‌పూర్ సమీపంలోని లింగా (కల్మేశ్వర్) వద్ద రూ. 70,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్ గ్యాసిఫికేషన్ మరియు కెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.ఈ ఒక్క ప్రాజెక్ట్ ద్వారానే సుమారు 30,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.ఇది భారతదేశ ఇంధన మరియు రసాయన రంగాల్లో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, 'ఆత్మనిర్భర్ భారత్'కు ఊతమిస్తుంది.

విద్యుత్ రంగంలో అగ్రగామిగా..
విదర్భ ప్రాంత ఇంధన అవసరాలను తీర్చడంలో అదానీ గ్రూప్ ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తోంది.మహారాష్ట్రలోనే అతిపెద్దదైన 3,300 మెగావాట్ల ప్లాంట్ ద్వారా నిరంతర విద్యుత్ అందుతోంది. 2025లో పునరుద్ధరించబడిన 600 మెగావాట్ల ప్లాంట్(బుటిబోరి ప్లాంట్) తో కలిపి, రాష్ట్రానికి మొత్తం 6,600 మెగావాట్ల నమ్మకమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు అదానీ గ్రూప్ 25 ఏళ్ల ఒప్పందం చేసుకుంది.
#WATCH | Nagpur | Adani Defence and Aerospace Director, Jeet Adani, says, "The momentum that we see today is no accident. It is the outcome of leaders who have invested their political capital, administrative vision, and personal conviction in unlocking Vidarbha's potential.… https://t.co/kRmv2wYyj9 pic.twitter.com/2L61WuxatZ
— ANI (@ANI) February 6, 2026
ఏవియేషన్,లాజిస్టిక్స్ హబ్‌గా నాగ్‌పూర్
నాగ్‌పూర్ భౌగోళిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అదానీ గ్రూప్ మరిన్ని పెట్టుబడులు పెడుతోంది.మిహాన్ (MIHAN)లో 30 ఎకరాల్లో విస్తరించిన విమానాల మరమ్మతు కేంద్రం (MRO) ద్వారా నాగ్‌పూర్‌ను అంతర్జాతీయ విమానయాన కేంద్రంగా మారుస్తున్నారు.బోర్ఖేడి వద్ద 75 ఎకరాల ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో (ICD) మరియు 24 సరిహద్దు చెక్ పోస్ట్‌ల నిర్వహణ ద్వారా రవాణా ఖర్చులను తగ్గించి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నారు.
సామాజిక బాధ్యత (CSR)
పారిశ్రామిక అభివృద్ధితో పాటు, అదానీ ఫౌండేషన్ ద్వారా విదర్భ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు జీత్ అదానీ తెలిపారు.ఆరోగ్యం,విద్య,43 స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ కోసం 2030 నాటికి 10 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు."మాకు విదర్భతో ఉన్న బంధం కేవలం వ్యాపార సంబంధం కాదు.. ఇది తరతరాల అనుబంధం" అని జీత్ అదానీ భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ,కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో విదర్భ సరికొత్త ప్రగతి పథంలో దూసుకుపోతోందని ఆయన కొనియాడారు
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications