• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎఫ్ఐపీబీ నిబంధనలు బేఖాతర్!: ఐఎన్ఎక్స్‌లో పెట్టుబడుల కోసం అడ్డదార్లు

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా వ్యవహారం మరోసారి వార్తల్లోకెక్కింది. మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసింది. బ్రిటన్ రాజధాని లండన్ నుంచి ఉదయం తమిళనాడు రాజధాని చెన్నై చేరుకున్న ఆయన్ను ఈ హవాలా కేసు దర్యాప్తునకు సహకరించడం లేదన్న అభియోగంతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నది.

విమానాశ్రయంలోనే కార్తీ చిదంబరాన్ని ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. చెన్నై నుంచి ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి తెచ్చారు. కార్తీ చిదంబరంతో సంబంధం ఉన్న కొన్ని సంస్థలు ఐఎన్‌ఎక్స్ మీడియాలో రూ.305 కోట్ల అక్రమ పెట్టుబడుల కోసం ఎఫ్‌ఐపీబీపై ఒత్తిడి తెచ్చాయన్నది సీబీఐ ఆరోపణ.

 మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కొడుకే కార్తీ చిదంబరం

మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కొడుకే కార్తీ చిదంబరం

దీంతో కార్తీ చిదంబరంతోపాటు ఐఎన్‌ఎక్స్ మీడియా, మరో ఎనిమిది మందిని, కొందరు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 2007లో ఇది జరుగగా, ఆ సమయంలో కార్తీ తండ్రి చిదంబరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు.

 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను ఎఫ్ఐపీబీ ఆమోదిస్తే విదేశీ పెట్టుబడులకు ఓకే

ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను ఎఫ్ఐపీబీ ఆమోదిస్తే విదేశీ పెట్టుబడులకు ఓకే

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ఓ జాతీయ సంస్థే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ). కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం పరిధిలో ఇది పనిచేస్తుంది. దేశంలోకి ఆటోమేటిక్ మార్గంలో కాక వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనల్ని పరిశీలించి, ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌కు సిఫార్సు చేస్తుంది. క్యాబినెట్ ఆమోదిస్తే ఆ ఎఫ్‌డీఐకి ఇక మార్గం సుగమమైనట్లే.

ఐఎన్ఎక్స్ మీడియా ప్రతిపాదనకు ‘నో' అన్న ఎఫ్ఐపీబీ

ఐఎన్ఎక్స్ మీడియా ప్రతిపాదనకు ‘నో' అన్న ఎఫ్ఐపీబీ

విదేశీ పెట్టుబడుల విషయమై విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ) ఆమోదం కోసం ఐఎన్‌ఎక్స్ మీడియా నుంచి ఓ దరఖాస్తును 2007 మార్చి 15న కేంద్ర ఆర్థిక శాఖ అందుకున్నది. ఈ క్రమంలోనే అదే ఏడాది మే 18న జరిగిన ఎఫ్‌ఐపీబీ సమావేశంలో ఐఎన్‌ఎక్స్ మీడియా ప్రతిపాదన పరిశీలనకు వచ్చింది. అయినా ఐఎన్‌ఎక్స్ న్యూస్‌లో ఐఎన్‌ఎక్స్ మీడియా పరోక్ష విదేశీ పెట్టుబడి ప్రతిపాదనను ఎఫ్‌ఐపీబీ అంగీకరించలేదు. ఇందులో ఉన్న రూ.4.62 కోట్ల ఎఫ్‌డీఐని మాత్రమే అనుమతించింది. విదేశీ మదుపర్లకు ఒక్కో షేర్‌ను రూ.800లకుపైగా ధరకు జారీ చేసుకోవచ్చని సూచించింది.

 ఐఎన్ఎక్స్ మీడియాలో 26 శాతం విదేశీ పరోక్ష పెట్టుబడులు

ఐఎన్ఎక్స్ మీడియాలో 26 శాతం విదేశీ పరోక్ష పెట్టుబడులు

ఎఫ్‌ఐపీబీ ఆమోదానికి విరుద్ధంగా ఐఎన్‌ఎక్స్ మీడియా ముందడుగు వేసిందని సీబీఐ ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. ఉద్దేశపూర్వకంగానే నిబంధనల్ని ఉల్లంఘిస్తూ.. ఐఎన్‌ఎక్స్ న్యూస్‌లో 26 శాతం దాకా పరోక్ష విదేశీ పెట్టుబడుల్ని స్వీకరించింది. దీంతో ఐఎన్‌ఎక్స్ మీడియాకు రూ.305 కోట్లకు పైగా నిధులు అందాయి. దీనికి కారణం కార్తీ పలుకుబడి వల్ల కొందరు అధికారులు నిబంధనల్ని ఉల్లంఘించి పని చేయడమేనని సీబీఐ ఆరోపిస్తున్నది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలన్న రెవిన్యూ శాఖ విజ్ఞప్తినీ సదరు అధికారులు పట్టించుకోలేదని సీబీఐ చెప్తున్నది.

 ఐఎన్ఎక్స్, కార్తి చిదంబరం మధ్య క్విడ్‌ ప్రోకో ఇలా

ఐఎన్ఎక్స్, కార్తి చిదంబరం మధ్య క్విడ్‌ ప్రోకో ఇలా

చెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రమోటర్ కార్తీతో కలిసి ఐఎన్‌ఎక్స్ మీడియా నేరపూరిత కుట్రకు పాల్పడిందని సీబీఐ ఎఫ్ఐఆర్ పేర్కొన్నది. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం.. కార్తీ త్రండి కావడంతో ఎఫ్‌ఐపీబీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులను లోబర్చుకుని, తమకు కావాల్సిన ప్రయోజనాన్ని పొందిందని సీబీఐ ఆరోపణ సారాంశం. దీనికి ప్రతిఫలంగా క్విడ్ ప్రోకో ఆధారంగా కార్తీకి ఐఎన్‌ఎక్స్ మీడియా చెల్లింపులు జరిపింది. చెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ వేదికగా ఐఎన్‌ఎక్స్ గ్రూప్‌నకు, కార్తీకి మధ్య లావాదేవీలు జరిగాయి. వీటికి ఆర్థిక శాఖ అనుకూలంగా పావులు కదిపింది. దీంతో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరంపైనా సీబీఐ దృష్టి పెట్టింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New Delhi: Senior Congress leader P Chidambaram's son Karti was arrested by the Central Bureau of Investigation (CBI) in Chennai on Wednesday for not cooperating in the investigation of a money laundering case. He was taken into custody at the Chennai airport on Wednesday morning just after he landed from London. Karti is currently being questioned inside the airport and will be taken to Delhi later in the day, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more