Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భర్తకు బాయ్ బాయ్, ఆంటీ జస్ట్ మిస్, లాయర్ ప్రియుడు ఫినిష్!

చెన్నై/తిరువల్లూరు: వివాహం జరిగిన 15 సంవత్సరాల తరువాత భర్తతో భార్యకు తేడాలు వచ్చేశాయి. అప్పటికే ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. భర్తకు విడాకులు ఇవ్వాలని కోర్టు నోటీసులు ఇచ్చిన మహిళ కోర్టు చుట్టూ తిరిగింది. కేసు వాదిస్తున్న లాయర్ విడాకులు తీసుకుంటున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ వయసులో ఇలాంటి పాడుబుద్ది ఏమిటని ఆ మహిళకు ఆమె తల్లిదండ్రులు, బంధువులు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.

ఎవ్వరిమాట వినని ఆ మహిళ ప్రియుడితో కలిసి అద్దె ఇంటిలో కాపురం పెట్టింది. మహిళ అడ్రస్ కోసం రెండు నెలలు గాలించిన ఆమె కుటుంబ సభ్యులు చివరికి ఆమె ఆచూకి తెలుసుకున్నారు. కత్తులు తీసుకుని మహిళను, ఆమె లాయర్ ప్రియుడిపై దాడి చేశారు. ప్రియుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మహిళకు మాత్రం తీవ్రగాయాలయ్యాయి.

సత్య వెంకట్రాజన్‌ల వివాహం

సత్య వెంకట్రాజన్‌ల వివాహం

తమిళనాడులోని మదురైలో నివాసం ఉంటున్న శంకర్ అనే వ్యక్తి ఆయన కుమార్తె సత్యాను 15 సంవత్సరాల క్రితం వెంకటరాజన్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. సంతోషంగా కాపురం చేసిన వెంకటరాజన్, సత్యా దంపతులు ముగ్గురు కుమార్తెలు. ముగ్గురు కుమార్తెలతో కలిసి సత్యా చాలా సంతోషంగానే జీవించింది.

భర్తతో విడిపోయిన సత్య

భర్తతో విడిపోయిన సత్య

సత్యాలో మార్పులు రావడంతో వెంకటరాజన్‌తో గొడవలు ప్రారంభమయ్యాయి. పెద్దలు పంచాయితీలు చేసినా వెంకటరాజన్, సత్యాల కాపురం చక్కబడలేదు. చాలాకాలంగా పాటు వెంకటరాజన్, సత్యా దంపతులు గొడవలు పడుతూనే ఉన్నారు. పెద్దలు పంచాయితీలు చేసినా వెంకటరాజన్, సత్యా దంపతుల కాపురంలో ఎలాంటి మార్పురాలేదు. గత ఏడాది భర్త వెంకటరాజన్ తో విడిపోయిన సత్యా వేరుగా జీవనం సాగిస్తోంది.

లాయర్ ఎంట్రీతో కథలో మలుపు

లాయర్ ఎంట్రీతో కథలో మలుపు

భర్తతో విడాకులు తీసుకోవడానికి సత్యా కోర్టును ఆశ్రయించింది. విడాకుల కేసు వాదిస్తున్న లాయర్ వెంకటేష్ ను కలవడానికి సత్యా అతని దగ్గరకు వెళ్లివస్తుండేది. ఇదే సమయంలో తనకంటే చిన్నవాడైన లాయర్ వెంకటేష్ తో సత్యా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడు వెంకటేష్ తో కలిసి సత్యా హ్యాపీగా జీవితం సాగించింది

లాయర్-సత్యాల మధ్య సంబంధం...

లాయర్-సత్యాల మధ్య సంబంధం...

సత్యా చూసేందుకు కాస్త బలంగాను, ఎత్తుగా ఉండటంతో లాయర్ వెంకటేష్ ఆమె మోజులో పడిపోయాడు. ఓ వైపు భర్తతో వేరై మరోవైపు ప్రియుడైన లాయర్‌కు దగ్గరైంది సత్యా. ఈ క్రమంలోనే కూతుళ్ల బాగోగులను పట్టించుకోవడం మానేసింది. పూర్తిగా ప్రియుడి మత్తులోకి జారుకుంది.

ప్రియుడితో పారిపోయిన సత్య

ప్రియుడితో పారిపోయిన సత్య

విడాకుల కేసు వాదిస్తున్న లాయర్ వెంకటేష్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న సత్యా అతనితో నే జీవితం పంచుకోవాలనుకుంది. లాయర్ వెంకటేష్ తో సత్యా వివాహేతర సంబంధం పెట్టుకునిందని ఆమె కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. తండ్రి శంకర్ తో పాటు బంధువులు అందరూ బుద్ది మార్చుకోవాలని సత్యాకు గట్టిగా చెప్పారు. కుటుంబ సభ్యులు, బంధువుల మాటలను సత్యా ఏమాత్రం లెక్కచెయ్యలేదు. లాయర్ ప్రియుడు వెంకటేష్ తో కలిసి సత్యా పారిపోయింది.

మొబైల్ నెంబర్ మార్చేసి మకాం మార్చేసింది

మొబైల్ నెంబర్ మార్చేసి మకాం మార్చేసింది

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని కొగ్గళూరు సమీపంలోని అంజేనయపురంలో సత్యా, వెంకటేష్ అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టేశారు. లాయర్ వెంకటేష్ వారంలో మూడు రోజులు సత్యా దగ్గరకు వచ్చి పోతుండేవాడు. సత్యా కనపడకపోవడంతో ఆమె కోసం కుటుంబ సభ్యులు గాలించారు. రెండు నెలల పాటు సత్యా కోసం గాలించిన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు చివరికి ఆమె ఉన్న ఇంటి అడ్రెస్ కనుక్కున్నారు.

అర్దరాత్రి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ?

అర్దరాత్రి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ?

సత్యా ఆమె ప్రియుడు వెంకటేష్‌ ఇద్దరూ బెడ్ రూమ్ లో కలిసి ఉండగా, సత్యా కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంటి లోపలకు చొరబడిన కుటుంబ సభ్యులు ముందుగా లోపలనుంచి తాళం వేశారు. ఆ తర్వాత సత్యా ఆమె ప్రియుడు వెంకటేష్ తో గొడవ పెట్టుకున్నారు. మాటామాటా పెరిగిపోడంతో సహనం కోల్పోయిన బంధువులు కత్తులు తీసుకుని సత్యా, ఆమె ప్రియుడు వెంకటేష్ ను ఇష్టం వచ్చినట్లు పొడిచేశారు. ఈ ఘటనలో ప్రియుడు వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రాణాలతో బయటపడ్డ సత్య

ప్రాణాలతో బయటపడ్డ సత్య

సత్యాకు కత్తిపోట్లు ఎక్కువ పడటంతో ఆమె స్పృహ కోల్పోయింది. సత్యా కూడా చనిపోయిందని బావించిన ఆమె బంధువులు ఇంటి బయట లాక్ చేసుకుని వెళ్లిపోయారు. స్పృహలోకి వచ్చిన సత్యా గట్టిగా కేకలు వేసింది. ఇంటిలోపల నుంచి కేకలు వినపడంతో స్థానికులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సత్యాను తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చెయ్యడంతో ఆమె కోలుకుంది.

తన భార్య సత్యా క్యారెక్టర్ సక్రమంగా లేదని ఆమె భర్త విడాకులు తీసుకున్నాడు. లాయర్ ప్రియుడు వెంకటేష్ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిఅయిన సత్యా ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతోంది. అయితే లాయర్ వెంకటేష్ హత్య కేసులో ఇంకా ముగ్గురు పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+