గురువారం- డోన్ట్ మిస్: దత్తాత్రేయుడిని పూజించే పవిత్ర రోజు..ఇలా చేయండి

ఆది గురువు..త్రిమూర్తి స్వరూపుడు..దేవతలకూ జ్ఞానబోధ చేసిన వాడు దత్తాత్రేయుడు. సృష్టి-స్థితి-లయకారులైన బ్రహ్మ-విష్ణు-మహేశ్వరుల ఏక స్వరూపం దత్తాత్రేయుడిది. గురుతత్వానికి ఆద్యుడు. ఆదిగురువు. ఈ గురువారమే దత్తాత్రేయ జయంతి. సమస్త దేవతలకూ ఆదిగురువులుగా పేరున్న సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కుమారుడు దత్తాత్రేయుడు. ప్రదోష కాలంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అత్రి మహర్షి కుమారుడు కావడం వల్ల ఆత్రేయుడిగా.. దత్తాత్రేయుడిగా పిలుస్తారు.

దత్త స్వరూపాన్ని అసామాన్యమైనది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారం కావడం వల్ల ఈ విశిష్ఠత ఏర్పడింది. త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించిన వాడు. అలా ఆవిర్భవించినదే దత్తావతారం. దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. గొప్ప అవధూత.

All Key Timings Date and Tithi of Datta Jayanti 2025

శ్రీపాదవల్లభుడు, న‌ృసింహ సరస్వతి, అక్కల్‌కోట్ మహరాజ్, మాణిక్య ప్రభు, షిరిడీ సాయిబాబా, గజానన మహరాజ్, శ్రీకృష్ణ సరస్వతీ మహరాజ్, వాసుదేవానంద సరస్వతిగా దత్తావతారాలుగా వెలసినట్లు దత్త పురాణం చెబుతోంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ పర్వదినాన్ని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ల్లో జరుపుకొంటారు. మహారాష్ట్రలోని అక్కల్‌కోట్‌లో ఏక్‌ముఖి దత్తాత్రేయుడి ఆలయం ఉంది. కర్ణాటకలోని కలబురగి జిల్లా గాణగాపురలో దత్తాత్రేయుడి ఆలయం, ఆశ్రమం ఉన్నాయి. మాణిక్య ప్రభుగా మహారాష్ట్ర, శ్రీపాదవల్లభుడి రూపంలో గుజరాత్‌లో దత్తాత్రేయుడిని పూజిస్తారు. పవిత్ర మాసాల్లో ఒకటైన మార్గశిరంలో సంభవించే పౌర్ణమి నాడు దత్తాత్రేయుడి జయంతి కావడం ఆధ్యాత్మికంగా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

దత్తజయంతి నాడు వ్రతాలు చేస్తారు. నదులు, సముద్రాల్లో పుణ్యస్నానాలు చేసి, దత్తాత్రేయుడిని పూజిస్తారు. అలా చేయడం వల్ల సకల దోషాలు పోతాయని, ఆయురారోగ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే పేదలకు దాన ధర్మాలు చేయాలి. దత్త పురాణాన్ని పఠించాలి. త్రిమూర్తి స్వరూపుడు కావడం వల్ల దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకుంటే.. బ్రహ్మ, శ్రీమహావిష్ణువు, పరమేశ్వరుడి ఆశీర్వాదం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

దత్త పూర్ణిమ తిథి డిసెంబర్ 4 ఉదయం 8:37 నిమిషాలకు ప్రారంభమౌతుంది. డిసెంబర్ 5 తెల్లవారు జామున 4:43 నిమిషాలకు ముగుస్తుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:14 నుండి 6:06 నిమిషాల వరకు ఉంటుంది. సంధ్య సమయం సాయంత్రం 5:58 నుండి 6:24 నిషాల వరకు. అమృత కాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:58 నిమిషాల వరకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+