మంగళవారం ఈ పనులకు దూరంగా ఉండండి.. బాగుపడతారు

మంగళవారం ఆంజనేయస్వామిని పూజిస్తారు. మరికొందరు శనివారం ఆయన్ను ఆరాధిస్తారు. ఆంజనేయస్వామి ఆశీస్సులు పొందాలంటే మంగళవారం పూజ చేయాలి, శని దోషం నుండి విముక్తి పొందాలంటే శనివారం పూజ చేయడం శ్రేయస్కరం. మంగళవారం కొన్ని చెడు అలవాట్లు ఉంటే, ఎంత పూజ చేసినా, హనుమాన్ చాలీసా పఠించినా ప్రయోజనం ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి.

మంగళవారం రోజున చేసే కొన్ని చెడు అలవాట్లు ఆర్థిక నష్టాలు, దురదృష్టాన్ని తెస్తాయి. ఈ రోజున వాటికి దూరంగా ఉండటం మంచిది. శాస్త్రాల ప్రకారం.. మంగళవారం ఆర్థిక లావాదేవీలకు అశుభ దినంగా పరిగణిస్తారు. అంటే- ఈ రోజున డబ్బు అప్పు తీసుకోవడం లేదా ఇతరులకు అప్పు ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. చేతిలో డబ్బు కొరత ఏర్పడవచ్చు. రుణమోచన మంగళ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

మంగళవారం గాజు వస్తువులను కొనుగోలు చేయడం లేదా బహుమతిగా ఇవ్వడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు పెరగొచ్చు. ఏదీ కలిసిరాకపోవచ్చు. దీనికి బదులుగా మంగళవారం రోజు ఎరుపు రంగుకు సంబంధించిన వస్తువులను బహుమతిగా ఇవ్వడం శుభప్రదం. ఆధ్యాత్మికంగా మంగళవారం శక్తిమంతమైనదిగా పరిగణించినప్పటికీ.. ఆర్థిక లేదా వ్యాపార ప్రారంభాలకు ఇది శుభ దినం కాదు.

మంగళవారం రోజున ఏవైనా పెట్టుబడులు పెడితే అవి నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు లేకపోలేదు. ఫలితంగా ఆర్థిక నష్ట భయం పెరుగుతుంది. అశాంతి ఏర్పడుతుంది. పురోగమనానికి ఆటంకాలు ఏర్పడతాయి. బుధవారం పెట్టుబడులు పెట్టడం మరింత శుభప్రదంగా భావిస్తారు.

చాలా మంది మంగళవారం జుట్టు, గోర్లు కత్తిరించుకుంటారు. శాస్త్రాల ప్రకారం.. అలా చేయడం చాలా అశుభకరం. ఈ తప్పు చేయడం వల్ల ఆర్థిక నష్టం, ఇబ్బందులు, వ్యక్తి ఆయుష్షు తగ్గుతాయని నమ్ముతారు. ఈ రోజున క్షవరం లేదా గోర్లు కత్తిరించడం మానుకోవడం మంచిది. మంగళవారం నాడు బార్బర్ షాపులు చాలావరకు మూసి ఉంచడానికి ఇదే ప్రధాన కారణం.

మంగళవారం కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం కూడా నిషేధం. ముఖ్యంగా ఈ రోజున నలుపు రంగు దుస్తులు, ఇనుప వస్తువులు, భూమి లేదా ఆస్తి, సౌందర్య సాధనాలను కొనుగోలు చేయకుండా ఉండాలి. ఈ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల జీవితంలో ఆటంకాలు పెరిగి, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది వ్యక్తి కెరీర్‌పై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మంగళవారం ఎరుపు, నారింజ రంగు దుస్తులను కొనుగోలు చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.

Disclaimer: మంగళవారం నాడు చేయకూడని పనుల గురించి తెలియజేడయమే ఈ కథనం ఉద్దేశం. వీటిని మరింత మెరుగ్గా అనుసరించదలిచిన వారు శాస్త్రం గురించి తెలిసిన వారిని సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+