ఓ 5 గురువారాలు తులసికి ఇవి సమర్పించి చూడండి..

తులసి.. హిందూ సంప్రదాయంలో పవిత్రమైన దేవతా స్వరూపంగా పూజిస్తారు. దాదాపు ప్రతి హిందువుల ఇంట్లో తులసి చెట్టు ఉండటం సాధారణం. సరైన విధి విధానాలతో తులసిని ఆరాధించే వారికి జీవితంలో ఆనందం, సౌభాగ్యం కలుగుతాయని విశ్వాసం. తులసి పూజలో భాగంగా అనేక వస్తువులను సమర్పిచండం ఆనవాయితీ. చక్కెర పొంగలి, బెల్లంతో చేసిన తీపి పదార్థాలు, అరటి, యాపిల్ వంటి పండ్లను తులసీ పూజకోసం వినియోగిస్తారు. నైవేద్యంగా సమర్పిస్తారు.

అత్యంత శుభప్రదం..

వీటిలో పచ్చిపాలు కూడా ఒకటి. తులసికి పచ్చిపాలు సమర్పించడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి సంతుష్టులవుతారని, అంతులేని ఆశీస్సులు అందిస్తారని నమ్ముతారు. తులసి పూజా సమయంలో పాలను నైవేద్యంగా సమర్పించేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను తప్పక పాటించాలి. గురువారం నాడు తులసి మొక్కకు పాలు సమర్పించడం అత్యంత శుభకరం.

Tulsi Milk Ritual That Attracts Lakshmi on Thursdays Invite Prosperity is considered auspicious

పాలు కలిపిన నీటిని..

ఆ రోజున తెల్లవారు జామునే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఒక పాత్రలో నీరు తీసుకొని, కొద్దిగా పచ్చిపాలు కలపాలి. ఆ తర్వాత ఈ పాలు కలిపిన నీటిని తులసి మొక్క మొదలుకు సమర్పించాలి. ఈ విధంగా తులసికి పాలు కలిపిన నీటిని అర్పిస్తున్నప్పుడు.. "మహాప్రసాద జనని సర్వసౌభాగ్యవర్ధినీ, ఆది వ్యాధి జరాముక్తం తులసి త్వం నమోస్తుతే.." అనే మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో జపించాలి. ఇది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి చాలా ప్రయోజనకరమైన పరిష్కారం. ఈ ఆచారం ఆర్థిక కష్టాల నుండి విముక్తిని అందిస్తుంది.

జాతకంలో గురు స్థానం..

తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించడం వలన జాతకంలో గురు స్థానం బలపడుతుంది. జాతకంలో గురువు బలహీనంగా ఉన్నవారికి ఈ పరిహారం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇంట్లో అశాంతి నెలకొంటే, తరచుగా కుటుంబ కలహాలు జరుగుతుంటే లేదా కుటుంబ సభ్యుల మనస్థితి సరిగా లేకపోతే, తులసికి పాలు సమర్పించడం వలన ప్రశాంతత లభిస్తుంది. ఇది కుటుంబంలో సంతోషాన్ని, సామరస్యాన్ని పెంచుతుంది.

పాలను నేరుగా మొక్కపై పోయకూడదు..

శాస్త్రాలు, సంప్రదాయాల ప్రకారం.. ఆదివారం, ఏకాదశి తిథి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఉన్న రోజులలో తులసికి పాలు కలిపిన నీటిని సమర్పించరాదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురవుతారని భక్తులు నమ్ముతారు. తులసికి అర్పించే పాలను మరిగించకూడదు. అవి పచ్చిపాలే అయి ఉండాలి. పాలను నేరుగా మొక్కపై పోయకూడదు. నీరు కలపని పాలు మొక్కకు హాని కలిగిస్తాయి. అందుకే నీటిలో కొంత పాలు కలిపి మాత్రమే తులసికి సమర్పించాలి.

Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న సూచనలు సమాచారం కోసం మాత్రమే. దీన్ని ఆచరించాలనుకునే వారు మరింత మెరుగైన ఫలితాల కోసం పండితుల సలహా తీసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+