వైసీపీ అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు: చంద్రబాబు, లోకేష్‌లపై కేసు నమోదు

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఐటీ యాక్ట్ కింద శనివారం కేసు నమోదైంది. తిరుపతి ఎంపీ స్థానానికి వైయస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురుమూర్తిపై టీడీపీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో అనుచిత పోస్టు వెలువడింది.

గురుమూర్తితోపాటు ఎస్సీ సామాజిక వర్గాన్ని కించపరిచేలా సదరు పోస్టు ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. దీనిపై బాపట్ల ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్ కుమార్... డీజీపీ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు చంద్రబాబు, లోకేష్‌లపై కేసు నమోదు చేశారు.

case registered against Chandrababu and Nara Lokesh.

ఇది ఇలావుంటే, మరోవైపు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కూడా కేసు నమోదైంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

Recommended Video

    #TirupathiBypoll : Chandrababu Visits Tirumala Temple తిరుమలలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!!

    ఈ మేరకు కర్నూలు జిల్లా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎన్ నారాయణ రెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దేవినేని ఉమా ఏప్రిల్ 7న తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి తిరుపతి అంటే ఇష్టం లేదనే విధంగా మాట్లాడారు. అంతేగాక, నకిలీ వీడియోను ప్రదర్శించారని, దాన్ని తన ట్విట్టర్ ఖాతాలోనూ పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం జగన్ అనని మాటలను అన్నట్లుగా మార్ఫింగ్ చేసి బురద చల్లే ప్రయత్నం చేసిన ఉమాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కోరారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+