తనను అవమానించిన వారికి శిక్షలు పడేవరకు పోరాడతా.. ఎమ్మెల్యే శ్రీదేవి

వినాయక మండపం వద్ద కులం పేరుతో దూషించిన టీడీపీ నేతలపై ఎస్సీ,మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేశానని తాడికొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలిపారు.కుల వివక్షత ప్రదర్శించిన వారిపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని కమీషన్‌ను కోరినట్లు చెప్పారు. ఈ సంధర్భంగా కేసులోని నిందితులందరికీ శిక్షలు పడేవరకు పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

 YSRCP MLA Sridevi had lodged a complaint SC commission

కాగా టీడీపీ నేతలు ఆహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆమే ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమే ఎస్సీలపై వివక్షత చూపుతున్నారని అన్నారు. టీడీపీ ఆగడాలను చూస్తూ ఊరుకోమని ఆమే హెచ్చరించారు.టీడీపీ హయాంలో విశాఖ జిల్లా జెర్రిపోతుల గ్రామంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసిన విషయాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక కర్నూలు జిల్లాలో శవాన్ని పూడ్చిపెట్టేందుకు గొయ్యి తవ్వినందుకు దళితుల ఆస్తులన్నింటినీ ధ్వంసం చేశారని తెలిపారు. నారా వారిపల్లెలో దశాబ్దాలుగా దళితులను ఓట్లు వేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు.చంద్రబాబు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని.. కానీ వైఎస్‌ జగన్ మాత్రం తమని పల్లకిలో కూర్చోబెట్టి మోస్తున్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+