Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లక్షా 87 వేలు దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో 1378 మందికి పాజిటివ్..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 1500 నుంచి 2 వేల వరకు వచ్చిన పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 13 వందల పైచిలుకు పాజిటివ్ కేసులు వచ్చాయి. 1378 పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 87 వేల 211కి చేరింది.

ఆదివారం కరోనా వైరస్ నుంచి 1932 మంది కోలుకున్నారు. దీంతో వైరస్ తగ్గిన వారి సంఖ్య లక్ష 56 వేల 431కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29 వేల 673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 24 వేల 54 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో కరోనా వైరస్‌తో ఏడుగురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 1107కి చేరింది.

1378 corona cases register in telangana

గ్రేటర్ పరిధిలో 254 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చాయి. కరీంనగర్‌లో 152, రంగారెడ్డిలో 147 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రికవరీ రేటు కూడా పెరగడం సానుకూలంగా మారింది. ఇటు వ్యాక్సిన్ ప్రయోగాలు రెండు, మూడు దశల్లో ఉండటంతో మరికొద్ది నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ లోపు వైరస్ సోకిన వారందరూ దాదాపుగా కోలుకునే పరిస్థితి ఉంది. కానీ ఇతర వ్యాధులు ఉన్నవారు తప్పా.. మిగతావారు వేగంగా క్యూర్ అవకాశాలే మెరుగ్గా ఉన్నాయి. దేశంలో వ్యాక్సిన్ ఉచితంగా అందరికీ పంపిణీ చేయాలంటే రూ.80 వేల కోట్ల వ్యయం అవుతోంది.

Recommended Video

    Hyderabad లో తగ్గని Corona ఉధృతి, భౌతిక దూరం ఏది? | Corona Bulletin | Telangana

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+