కరోనా తగ్గుముఖం.. 2 వేలకు పైగా కేసులు, తెలంగాణలో ఇలా..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంది. వాతావరణం కాస్త చల్లబడటంతో వైరస్ కూడా మిన్నకుండిపోతోంది. గత కొద్దీరోజులుగా వస్తోన్న కేసులే దీనికి నిదర్శనం. గత 24 గంటల్లో 1,36,096 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 2,175 పాజిటివ్ కేసులు వచ్చాయి. గ్రేటర్ పరిధిలో కొత్తగా 253 కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది.
ఇటు అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 5, ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 8, కామారెడ్డి జిల్లాలో 9 కేసులను గుర్తించారు. అదే సమయంలో 3,821 మంది కరోనా నుంచి కోలుకోగా, 15 మంది మరణించారు. కరోనాతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 3,346కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,918 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రికవరీ రేటు 94 శాతం ఉండటం కాస్త సంతోషకరమైన అంశం.రాష్ట్రంలో ఇప్పటివరకు 5,87,664 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,53,400 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇంకా 30,918 మందికి చికిత్స జరుగుతోంది.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. అక్టోబర్‌లో థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సరయిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జనానికి ఇబ్బందులు తప్పవు. సో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications