హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వెళ్లారు.. తిరిగిరాలేదు, ఇంతకీ ఆ బావిలో ఏం జరిగింది..!!

|
Google Oneindia TeluguNews

కౌటాల : బావిలో మోటారు అమరుస్తామని వెళ్లిన వారు తిరిగిరాలేదు. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వెళ్లారు. ఏం జరుగుతుందో తెలియలేదు. మరొకరిని పంపి .. నిశీతంగా గమనించేసరికి కొద్ది లోతుకు వెళ్లక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడిని పైకి లాగి ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురు శ్వాస ఆడక చనిపోవడంతో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ముత్యంపేటలో విషాదం చోటుచేసుకుంది. చేతికొచ్చిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

వెళ్లారే తప్ప ..

వెళ్లారే తప్ప ..

ముత్యంపేటలో కారెం రాజు తన కుటుంబంతో ఉంటున్నారు. ఆయనకు మహేశ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే వారి ఇంటి వద్ద 30 అడుగుల లోతు, మూడు అడుగుల వెడల్పు గల బావి ఉంది. అయితే దానికి మోటారు అమర్చాలని నిర్ణయించారు. ఇవాళ తొలుత తన కుమారుడు మహేశ్ బావిలోకి దిగాడు. అయితే తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునేందుకు రాకేశ్‌ను దింపారు. లోపల కరెంట్ షాక్ తగిలిందోమోనని భావించి .. విద్యుత్ ఆఫ్ చేశారు. తర్వాత శ్రీనివాస్‌ను కూడా దింపారు. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురిని దింపినా చడీ చప్పుడు లేదు. ఒక్కొక్కరు ఊబిలోకి వెళ్తున్నారే తప్ప స్పందించడం లేదు. దీంతో వారికి అనుమానం వచ్చింది.

నిశీతంగా పరిశీలిస్తే తప్ప ..

నిశీతంగా పరిశీలిస్తే తప్ప ..

మూడో వ్యక్తి శ్రీనివాస్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బయట ఉన్నవారి ఆందోళన ఎక్కువైంది. ఇలా కాదని మరో యువకుడిని మెల్లగా దించారు. కొద్ది లోతు వెళ్లాక ఆ యువకుడు అపస్మారకస్థితిలోకి చేరుకున్నాడు. దీంతో వారికి బావిలో శ్వాస ఆడటం లేదని నిర్దారణ అయ్యింది. వెంటనే అతడిని పైకి లాగారు. చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. కానీ ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో స్థానికులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

జేసీబీలతో

జేసీబీలతో

మరోవైపు తమ బావిలో మోటారు అమర్చేందుకు వెళ్లి ముగ్గురు తిరిగిరాలేదని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు .. జేసీబీల సాయంతో బావికి సమాంతరంగా తవ్వకాలు చేపట్టారు. బావిలో ఊపిరాడక చనిపోయిన ముగ్గురి మృతదేహలను వెలికితీస్తారు. అయితే గ్రామంలో ముగ్గురు యవకుల ఆకాల మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేశ్ కుటుంబసభ్యలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఓకేసారి ముగ్గురు చనిపోవడంతో స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు.

English summary
Karem raju is staying with his family in Muthampeta. He has a son named Mahesh. Their home, however, is a 30-foot deep, three-foot-wide well. However, it was decided that the motor should be fitted. Today, his son Mahesh got into the well. However, they later became concerned that there was no response. Rakesh is then brought in to find out what happened. Feeling the shock of the current inside .. the power was turned off.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X