సికింద్రాబాద్ గణపతి ఆలయంలో భక్తుడిపై పూజారి దాడి: వీడియో వైరల్
హైదరాబాద్: నగరంలోని ప్రముఖ సికింద్రాబాద్ గణపతి ఆలయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. దైవ దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడిపై అక్కడి ఓ పూజారి దాడి చేశారు. ఈ ఘటన ఆల్యంగా వెలుగులోకి వచ్చింది. రెండో రోజుల క్రితం గణపతి ఆలయానికి వచ్చిన ఉప్పల్‌కు చెందిన భక్తుడు.. వినియాకుడిని దర్శించుకున్నాడు.
పక్కనే ఉన్న ఉప ఆలయాలను దర్శించుకుంటున్న సమయంలో.. అనుమతి లేకుండా ఆ గుడిలోకి ఎలా వెళ్తావంటూ.. పూజారి ప్రభాకర్ శర్మ వాగ్వాదానికి దిగాడు. అంతేగాక, ఆ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన పూజారి.. ఏకంగా ఆ భక్తుడిపై దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా నువ్వు ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరించాడు.

కాగా, ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ క్రమంలో దాడి ఘటనపై భక్తుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆలయ అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ప్రభాకర్ శర్మపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పోలీసులు కూడా ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, భక్తుడిపై పూజారి దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో సదరు పూజారిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల్లో భక్తులకు భద్రత లేకపోతే ఎలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. భక్తుల పూజారులు దాడి చేసినా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. దేవునికి పూజలు చేయాల్సిన పూజారులే ఇలా దౌర్జన్యం చేస్తే భక్తులకు భద్రత ఎక్కడ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications