ప్రగతి భవన్ వద్ద బీజేపీ శ్రేణుల హల్ చల్..

హుజురాబాద్ విజయంతో బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రగతి భవన్ వద్ద బీజేపీ కార్యకర్తల హల్ చల్ చేశారు. ట్రిపుల్ ఆర్ స్టికర్ అంటించిన వాహనంతో బీజేపీకి కార్యకర్తలు ప్రగతి భవన్‌ వద్దకు వెళ్లారు. వాహనంపై బండి‌ సంజయ్‌తో పాటు ఎమ్మెల్యేలు రాజసింగ్, రఘనందనరావు, ఈటల రాజేందర్ ఫొటోలు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ సినిమా చూడు కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్యలను అరెస్టు చేయకుండా పోలీసులు పంపించి వేశారు.

అక్కడి నుంచి బీజేపీ కార్యకర్తలు బల్కంపేట్ ఎల్లమ్మ గుడిలో మొక్కులు చెల్లించటానికి వెళ్ళారు. నవంబర్ 2న ప్రగతి భవన్ వద్ద ట్రిపుల్ ఆర్ సినిమా చూపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్ని విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ శ్రేణులు ప్రగతి భవన్ వద్దకు వచ్చారు. అక్కడ కాసేపు హల్ చల్ చేశారు. దీంతో పోలీసులకు తలప్రాణం తోకకొచ్చింది.

bjp workers hungama at pragati bhavan

Recommended Video

    interview with bjp state president bandi sanjay on huzurabad by poll trends

    ఇటు హుజురాబాద్ ఎన్నిక ఈటల రాజేందర్‌కు జీవన్మరణ సమస్య.. గెలిచి తీరాలని పట్టుబట్టారు. రాజీనామా చేసిన సమయం నుంచి ప్రజలతో కలిసిపోయారు. జనాలకు గిప్టులు ఇస్తున్నారని అధికార పార్టీ ప్రచారం చేసినా.. నిలువలేదు. వాస్తవానికి అక్కడ టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఈటల రాజేందర్ గెలుస్తాడని అంతా భావించారు. కానీ మెజార్టీ మాత్రం ఈ స్థాయిలో వస్తుందని అనుకోలే.. ఊహించలేదు. 10 వేల లోపు మెజార్టీ వస్తుందని అంతా అంచనా వేశారు. కానీ ఈటల రాజేందర్.. కారుకు పంక్చర్ చేయడంతో కమలం వికసించింది. కానీ దానిని కూడా వారు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఆశించిన దాని కన్నా ఎక్కువ ఓట్లే వచ్చాయని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+