వాటర్ కోసం కాదు వాటాల కోసం పంచాయితీ: కాంగ్రెస్
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం పీక్‌కి చేరింది. నీటి వాటాలపై ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు/ నేతలు స్పందిస్తున్నారు. మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరడంతో.. సీఎంలు కూడా స్పందించారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం అధికార పార్టీలను విమర్శిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ సర్కార్ విధానాలను తప్పుపట్టింది. నీళ్ల కోసం పంచాయతీ కాదు అని హాట్ కామెంట్స్ చేసింది.
సాగు నీటి హక్కులు కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిలై అయ్యిందని కాంగ్రెస్ నేతలు విమర్శిచారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ పంచాయతీ వాటర్ కోసం కాదనీ.. వాటాల కోసమని మాజీ ఎమ్మెల్యే సంపత్ విమర్శించారు. ఇదీ జనాలకు కూడా క్రమంగా అర్థమవుతోందని చెప్పారు. సంగమేశ్వరంపై తాను అసెంబ్లీలో మాట్లాడితే గెంటేశారని గుర్తుచేశారు.

నీటి వాటాల తీరుపై కేసీఆర్‌ను విమర్శించారు దాసోజు శ్రావణ్. పనిలో పనిగా కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులను ఎండగట్టారు. ప్రాణాలు కాపాడే నర్సులను కేసీఆర్ సర్కారు అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ 300 కోట్లు పంపించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్ల పంచాయితీ ఓ దుర్మార్గమైన కుట్ర అని అభివర్ణించారు.
మరో నేత మల్లు రవి కూడా కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఏపీ మంత్రి కొడాలి నాని మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయిలో జరిగింది. జగదీశ్ రెడ్డి కూడా ఏపీ మంత్రులపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications