ఎయిర్‌పోర్టా..? గోల్డెన్ డెనా..? మరోసారి భారీగా పట్టుబడ్డ బంగారం
శంషాబాద్ ఎయిర్‌పోర్టు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన విమానాశ్రయం. ఎయిర్‌పోర్టు నిర్మించిన తర్వాత హైదరాబాద్‌తో అనుసంధానం మరింత తేలికైంది. తేలికగా చేరుకోవడం మంచి పరిణామం కాగా.. మరికొందరు దానిని క్యాష్ చేసుకుంటున్నారు. భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం అక్రమ రవాణా పట్టుబడటం కామన్‌గా మారిపోయింది. దీంతో ఇక్కడినుంచే ఎందుకు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారనే ప్రశ్న తలెత్తింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అక్రమంగా బంగారం తరలించడం తేలికని స్మగ్లర్లు భావిస్తారు. ఢిల్లీ, చెన్నైలో తనిఖీలు ఎక్కువ ఉన్నందున వారు కూడా హైదరాబాద్ చేరుకొని బంగారం మార్చాలని ప్రయత్నిస్తారు. ఈ విషయాన్ని ఇదివరకు పట్టుబడ్డ ఓ స్మగ్లర్లు స్వయంగా డీఆర్ఐ అధికారులకు తెలియజేయడం అప్పట్లో కలకలం రేపింది. ఇవాళ కూడా శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది.

దుబాయ్ నుంచి వస్తోన్న ముగ్గురు ప్రయాణికులు తమ లగేజీ తీసుకొచ్చారు. అప్పటికే ఉన్న సమాచారంతో ప్రతి ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇంతలో ముగ్గురి లగేజీపై అనుమానం వచ్చింది. ఏంటీ అని నిశీతంగా పరిశీలించగా బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. దాదాపు 5 కిలోల బంగారు బిస్కెట్లు పట్టుబడటంతో డీఆర్ఐ అధికారులే ఖంగుతిన్నారు. ఇంత మొత్తంలో స్మగ్లింగ్ చేస్తున్నారా అని నోరేళ్లబెట్టారు. వారిని అదుపులోకి తీసుకుని బంగారానికి సంబంధించి ప్రశ్నలు వేశారు. తర్వాత బంగారం సీజ్ చేసి కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications