Hyderabad: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. !
హైదరాబాద్ కు ఎంతో మంది ఉపాధి కోసం వస్తుంటారు. దీంతో పట్నం భారీగా అభివృద్ధి చెందింది. జనాభా వాహనాలు పెరగడంతో రోడ్లు ఇరుకుగా మారి ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో జీహెచ్ఎంసీ, ప్రభుత్వం సిటీలో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మిస్తోంది. తాజాగా జంక్షన్ల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా జీహెచ్ఎంసీచర్యలు చేపట్టింది. అదే సమయంలో రహదారిలో వాహనాల ద్వారా ప్రమాదాల నివారణకు సమర్ధవంతంగా వాహన కదలికలను నిశితంగా పరిశీలించనుంది.
చాలా దేశాల్లో రోడ్డు ప్రమాదాలు 40 నుంచి 60 శాతం వరకు జంక్షన్లలో జరుగుతున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జంక్షన్ల సుందరీకరణ, వాహనాలను క్రమబద్దీకరించడం, పాదచారులకు ప్రమాదాలు జరగకుండా నిరోధించడం కోసం జీహెచ్ఎంస ప్రధాన లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేస్తోంది. వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా అక్కడక్కడ ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న జంక్షన్ల అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే సర్కిల్ పరిధిలో గల ట్రాఫిక్ జంక్షన్లను గుర్తించి, ప్రమాదాలను అరికట్టేందుకు 7.8 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 107 జంక్షన్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.
జీహెచ్ఎంసీలో 107 జంక్షన్ల అభివృద్దిలో భాగంగా ప్రమాదాలు అరికట్టేందుకు సిగ్నల్ ఏర్పాటు, పాదచారుల ప్రమదాలు జరుగకుండా ఫుట్ పాత్ నిర్మాణంతో పాటు వాహనదారులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా చేపట్టేందుకు ప్రతిపాదించినప్పటికి కొన్ని స్థల ప్రభావం వలన మరికొన్ని ఫెడిబులిటీ లేకపోవడం, లేదా క్యాన్సల్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 31 జంక్షన్లు పూర్తి చేయగా 13 జంక్షన్ లు వివిధ అభివృద్ది దశలో ఉన్నాయి.
17 జంక్షన్లు పరిపాలన మంజూరు కావాల్సి ఉంది. 16 జంక్షన్లలో పనులు స్టార్ట్ చేయాల్సి ఉన్నవి. 8 టెండర్ దశలో ఉన్నాయి. మరో 8 భూసేకరణ చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications