ఆ రెండు శాఖల్లో ఖాళీలు ఉండొద్దు.. ఆయిల్ పామ్ సాగుచేసే వారికి గుడ్ న్యూస్
పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖలో ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. రెండో రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఆయిల్ పామ్ రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్ సహా కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్ రావు, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ఆయిల్ పాతమ్ పంట సాగు ప్రోత్సహించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2022-23 ఏడాదికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరచి ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆయిల్ పామ్ చేసే రైతులకు ఎకరాకు మొదటి ఏడాది 26 వేలు.. తర్వాత ఏటా రూ.5 వేల చొప్పున పెట్టుబడి ప్రోత్సాహకం కింద రాయితీ ఇస్తారు.

అటవీశాఖ, అటవీ అభివృద్ది సంస్థ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ సంయుక్తంగా ఆయిల్ పామ్ మొక్కలు నర్సరీలు పెంచాలని క్యాబినెట్ పేర్కొన్నది. పంటసాగు విధానం గురించి మరింత తెలుసుకునేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన అధ్యయన బృందం.. కోస్టారికా, మలేసియా, థాయ్ లాండ్, ఇండోనేషియాలో పర్యటించాలని క్యాబినెట్ స్పస్టంచేసింది. టీ ఐడియా, తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిబంధనల ప్రకారం ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సహకాలు అందించాలని మంత్రివర్గం ఆదేశాలు జారీచేసింది.












Click it and Unblock the Notifications