భాగ్యనగరంలో భారీ వర్షం.. ఇతరచోట్ల ముసురు, రాత్రి పూట వర్షం
గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. చిన్న వర్షానికే సిటీలోని ప్రాంతాలు వరదనీటితో నిండిపోతాయి. భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనజీవనాన్ని వర్షం అస్తవ్యస్తం చేసింది. పలు కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతంలో రోడ్లు జలమయం అయ్యాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్, మాన్సూన్ బృందాలు రంగం లోకి దిగాయి. అక్కడక్కడ మోకాలి లోతు నీరు నిలవడంతో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ సిబ్బంది మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటు రాష్ట్రవ్యాప్తంగా ముసురేసింది. గత రెండు మూడు రోజుల నుంచి వాతావరణం చల్లగా ఉంది. ముఖ్యంగా రాత్రిపూట వర్షం కురుస్తూనే ఉంది. దీని ప్రభావం మూడురోజుల వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది. వెదర్ ఆఫీషియల్స్ ఇన్ఫో బట్టి.. గురువారం రాత్రి వరకు వర్షం ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత దాని ప్రభావం మెల్లగా తగ్గనుంది.












Click it and Unblock the Notifications