బీజేపీలో చేరిన కరాటే కళ్యాణి: పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్
హైదరాబాద్: సినీనటి కరాటే కళ్యాణి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ మహిళా మోర్చ అధ్యక్షురాలు ఆకుల విజయ నేతృత్వంలో బీజేపీలో చారు. బీజేపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కరాటే కళ్యాణితోపాటు ఆమె అనుచరులు పార్టీలో చేారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని కరాటే కళ్యాణి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత విజయశాంతి పాల్గొన్నారు.

బండి సంజయ్ ను కలిసిన గౌడ సంఘాల నేతలు
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను రాష్ట్ర గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఛైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో పలువురు గౌడ సంఘాల నాయకులు కలిశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371 జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వనించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కి వినతి పత్రం అందజేశారు.
రాష్ట్రంలో తక్షణమే కల్లుగీత కార్పొరేషన్ పాలకవర్గాన్ని ప్రకటించడంతోపాటు 5 వేల కోట్ల రూపాయల నిధిని కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గౌడ సంఘాల నేతలు ఆ వినతి పత్రంలో కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఎక్స్ గ్రేషియాకు అడ్డుగా ఉన్న మెడికల్ బోర్డును తీసివేసి కల్లుగీత కార్మికులు మరణిస్తే రూ.10 లక్షలు పరిహారం ఇచ్చేలా ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరారు.
ఏజెన్సీ ఏరియాలో కల్లుగీతను పునరుద్దరించాలని, తక్షణమే గౌడ ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని, కల్లుగీత సొసైటీలకు రాష్ట్రంలోని 50 శాతం వైన్ షాపులను కేటాయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్.. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం బీజేపీ కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. గౌడసహా వివిధ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లో ఎండగట్టడంతోపాటు ఆయా భవనాలు నిర్మించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని సంఘం నేతలతో బండి సంజయ్ తెలిపారు.
బీజేపీ కార్పొరేటర్, నేతలపై దాడి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లిపై కేసు
మల్కాజ్‌గిరి జీహెచ్ఎంసీ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై బీర్ బాటిళ్లతో దాడి చేసి గాయపరచిన ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు స్పందించారు. ఐపీసీ సెక్షన్స్ 307, 323,324,143,147,149 కింద కేసులు నమోదు చేశారు. మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తోపాటు మరో 15 మంది కార్యకర్తల పై కేసులు నమోదు చేశారు.
Recommended Video
వేడుకలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా పై కూడా దాడి చేసి కెమెరాలు, ఫోన్లు లాక్కుని పరారైన ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా పరిగణించారు. మల్కాజ్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌ను పరామర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీమంత్రి విజయరామరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్సెస్ ప్రభాకర్ తదితరులు కార్పొరేటర్ శ్రవణ్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా దాడి ఘటనకు సంబంధించిన వీడియోలు చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నేతలు. దాడికి సంబంధించిన ఆధారాలున్నాయని, వెంటనే కేసు నమోదు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో పోలీసులు స్పందించి, ఎమ్మెల్యే మైనంపల్లితోపాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications