సభలు, రోడ్ షో.. ప్రచారంలో తండ్రీతనయులు బిజీబిజీ
Recommended Video

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మలివిడత ప్రచారంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. రోజుకు 3-5 సభల్లో పాల్గొంటున్నారు. అందులోభాగంగా శుక్రవారం వరంగల్ రూరల్, జనగామ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ ఖరారైంది. మధ్యాహ్నం డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించిన సభ మరిపెడలో జరగనుంది. అక్కడ కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం జనగామ, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. దాని తర్వాత తిరుమలగిరి పరిధిలోని తొర్రూరు క్రాస్ రోడ్డులో నిర్వహించే తుంగుతుర్తి నియోజకవర్గ సభకు వెళతారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు జనగామ ప్రిస్టన్ మైదానంలో నిర్వహించే సభకు హాజరవుతారు.
అటు కేసీఆర్ తనయుడు కేటీఆర్ రెండు నియోజకవర్గాలు కవరయ్యేలా రోడ్ షో నిర్వహిస్తున్నారు. మహేశ్వరం, ఎల్బీనగర్ స్థానాలు కవరయ్యే ముఖ్యమైన ప్రాంతాల్లో రోడ్ షో జరగనుంది. మహేశ్వరానికి సంబంధించి పహాడీ షరీఫ్ దర్గా దగ్గర సాయంత్రం 4 గంటలకు రోడ్ షో ప్రారంభమవుతుంది. అక్కడినుంచి షాహీ నగర్, బాలాపూర్, మల్లాపూర్ మీదుగా కొనసాగుతుంది.

సాయంత్రం 6 గంటలకు జిల్లెలగూడ బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం కర్మన్ ఘాట్ మీదుగా సరూర్ నగర్ ప్రియదర్శిని పార్క్ దగ్గర జరిగే సభలో ప్రసంగిస్తారు. అక్కడినుంచి కొత్తపేటకు వెళ్లి ఒమ్మీ హాస్మిటల్ దగ్గర నిర్వహించే సభలో పాల్గొంటారు. దాని తరువాత ఆర్కేపురం మీదుగా సిరీస్ రోడ్డు నుంచి కామినేని చౌరస్తాకు వస్తారు. అక్కడ జరిగే సభలో మాట్లాడతారు. అనంతరం మన్సూరాబాద్, సహారా, వనస్థలిపురం సుష్మా థియేటర్ మీదుగా రోడ్ షో కొనసాగుతుంది. చివరగా వనస్థలిపురం రైతుబజార్ దగ్గర నిర్వహించే సభలో ప్రసంగిస్తారు.












Click it and Unblock the Notifications