గంగమ్మ ఒడికి గణనాథుడు.. ప్రశాంతంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం:డీజీపీ

నవరాత్రుల భక్తుల పూజలు అందుకున్న గణనాథుడిని నిమజ్జనం పూర్తయ్యింది. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. పంచముఖ మహా రుద్రగణపతి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద జలప్రవేశం చేశాడు. ఆ భారీ గణపయ్య ఎలాంటి అవాంతరాలు లేకుండా గంగమ్మ ఒడికి చేరడంతో అధికారులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తులు భారీ ఎత్తున తరలిరావడంతో ఈ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. ఖైరతాబాద్ గణపతిని ట్యాంక్ బండ్ పై ఉన్న క్రేన్-4 ద్వారా నిమజ్జనం చేశారు. భారీ కొక్కేలకు తగిలించిన వినాయకుడిని నిదానంగా హుస్సేన్ సాగర్ నీటిలోకి దించారు. విగ్రహం పూర్తిగా మునగడంతో నిమజ్జనం పూర్తయింది.

khairatabad ganesh immersion completed in safely dgp mahender reddy said to media.

నిమజ్జనం కోసం పోలీసులు అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించారు. డీజీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ద్వారా సీసీ కెమెరాలను అనుసంధానం చేసి వాటి ద్వారా అధికారులు పర్యవేక్షించారు. ఎక్కడ ఏం జరిగినా అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని డీజీపీ మహేంద్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ విగ్రహాలు తమ తమ స్థానాల నుంచి బయలుదేరి.. నిమజ్జన ఘట్టం ముగిసిందని వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే 27 వేలకు పైగా సిబ్బంది పాల్గొన్నారని వివరించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరి సహాయ సహకారాలతో.. పూర్తి స్థాయిలో కొత్త టెక్నాలజీని వినియోగించి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని డీజీపీ చెప్పారు.

వినాయక నిమజ్జనం ఈ సారికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మేరకు నిమజ్జనం చేశారు. శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు 27,955 మంది వివిధ స్థాయిలలోని పోలీసు సిబ్బందితోపాటు గ్రే హ్యాండ్స్, ఆక్టోపస్ దళాలు కూడా బందోబస్తు విధులు నిర్వహించారు. ఈ ఏడాది కూడా నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సంజీవయ్య పార్క్, జేమ్స్ స్ట్రీట్, బేగంపేట రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేకంగా ఎంఎంటీఎస్ రైళ్ళను నడుపుతారు. భక్తులు, ఉత్సవాల నిర్వహకులు కూడా ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+