మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: కరోనా నుంచి కోలుకున్న సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేష్‌బాబు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. అవును కోవిడ్ బారినపడ్డ ఆయన కోలుకున్నారు. ఆరోగ్య పరిస్థితి ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని సన్నిహితులు వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం స్వల్ప లక్షణాలు బయటపడడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. వైద్యుల పర్యవేక్షణలో వారి సలహాలు, సూచనలు పాటిస్తూ క్వారంటైన్‌లో ఉన్నారు.
మహేష్ క్వారంటైన్‌లో ఉండగానే సోదరుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అన్నయ్యను చివరి చూపు కూడా చూసుకోలేకపోయారు. మహేష్ సోదరి పద్మ, గల్లా జయదేవ్‌ల తనయుడు గల్లా అశోక్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న 'హీరో' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ అవనుంది.

మేనల్లుడికి, చిత్ర బృందానికి విషెస్ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. త్వరలో 'సర్కారు వారి పాట' బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చెయ్యనున్నారు.
కరోనా.. ఒమిక్రాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. నాలుగు వారాల నుంచి ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నెలాఖరులోగా ఒమిక్రాన్ వ్యాపి మరింత పెరిగే అవకాశం లేకపోలేదని డీహెచ్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఫిబ్రవరిలోగా భారీగా కొవిడ్ కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఫిబ్రవరి చివరికి లోయస్ట్‌కి పడిపోయే ఛాన్స్ ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోతామని హెచ్చరించారు. అనవసరంగా జన సమూహాల్లోకి వెళ్లకూడదని, మాస్క్ మరువకూడదు.. వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని సూచనలు చేశారు. కోవిడ్ ఐసోలేషన్ కిట్స్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications