రాజా సింగ్‌కు 14 రోజుల రిమాండ్.. నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత
రాజా సింగ్‌ను పోలీసులు నాంపల్లి కోర్టు వద్దకు తీసుకొచ్చారు. అక్కడ అప్పటికే రాజా సింగ్ అనుకూల (అభిమానులు) వ్యతిరేక (ఎంఐఎం) కార్యకర్తలు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటు భారీగా పోలీసు బలగాలను మొహరించి.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాజా సింగ్‌కు నాంపల్లి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. అయితే బెయిల్ ప్లీను మేజిస్ట్రేట్ తిరస్కరించారు. ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది.
ఇటు చాంద్రాయణ గుట్ట, మలక్ పేట, చంచల్ గూడ మార్గం గుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాజా సింగ్‌ను చంచల్ గూడ జైలుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇటు రాజా సింగ్‌పై ఆరు చోట్ల కేసులు నమోదు చేశారు.

ఇటీవల హైదరాబాద్‌కు మునావర్ ఫరూఖీ వచ్చిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ కూడా ఆ షోకు హాజరయ్యారు. షో నిర్వహించొద్దని రాజా సింగ్ విన్నవించారు. అయినా షో నిర్వహించడంతో వీడియో పోస్ట్ చేశారు. అందులో మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా కామెంట్స్ ఉన్నాయట.
రాజా సింగ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. దీంతో బీజేపీ హైకమాండ్ స్పందించింది. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications