• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వెయిట్‌లిఫ్టర్ కార్తీక్ కలను నిలబెట్టారు-దీర్ఘకాలిక వెన్ను నొప్పికి యశోదాలో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌(RFA)

|

క్రీడాకారుల జీవితంలో గాయాలు, నొప్పులు సాధారణమే అయినప్పటికీ వాటి నుంచి కోలుకోడానికి వాడే మందుల విషయంలో అత్యంత శ్రద్ధ వహిస్తారు. డ్రగ్ లో ఏ చిన్న తేడా వచ్చినా డోపీగా తేలి కెరీర్ ఇబ్బందుల్లోపడే ప్రమాదముంది. ప్రత్యేకించి వెయిట్ లిఫ్టర్లకు గనుక వెన్నునొప్పి వస్తే ఇతరత్రా మందులువాడి ఇబ్బందులుపడిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయితే, నార్కోస్ జోలికి పోకుండా అత్యాధునిక చికిత్స విధానంలో దీర్ఘకాలిక వెన్నునొప్పిని శాశ్వతంగా పరిష్కరించడం ద్వారా హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రి ఓ యువ క్రీడాకారుడిని మళ్లీ నిలబెట్టగలిగింది. 2024 ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో ప్రాక్టీస్ చేస్తోన్న ఆ క్రీడాకుడు, వెన్ను నొప్పికి అతను తీసుకున్న చికిత్స వివరాలివి..

హైదరాబాద్ కు చెందిన 18 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ హలావత్ కార్తీక్ గురించి పరిచడం అక్కర్లేదు. 2011 నుంచి స్పోర్ట్స్ స్కూల్లో సాధన చేస్తున్న కార్తీక్‌.. ఖే లో ఇండియా క్రీడల్లో వరుసగా రెండు స్వర్ణాలు, పాఠశాల జాతీయ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలు, జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం.. ఇలా దాదాపు పోటీపడిన ప్రతి టోర్నీలోనూ పతకాలు గెలుస్తూ సాగాడు. అయితే, 2018లో ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఉండగా కార్తీక్ కు వెన్నునొప్పి మొదలైంది. సుదీర్ఘకాలం వెన్నునొప్పి కొనసాగడంతో కెరీర్ ఏమవుతుందోనని ఆందోళన చెందాడు, చాలా మంది డాక్టర్లు కలిసి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకున్నా ఫలితం రాలేదు. చివరికి..

RFA procedure at Yashoda Hospitals helps Weightlifter Halavath Karthik recover back pain

హైదరాబాద్ సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రిలో న్యూరో అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ రావి సుమన్ రెడ్డిని కలిసిన తర్వాత కార్తీక్ లో ఆశలు మళ్లీ చిగురించాయి. మందులకు నయం కాకుండా, మూడు నెలలకు మించి వెన్ను నొప్పి తగ్గకపోతే దాన్ని క్రానిక్‌ బ్యాక్ పెయిన్ అంటారని తెలిసిందే. వెయిట్ లిఫ్టర్ కార్తీక్ ఇబ్బందిని అత్యాధునిక 'రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌' విధానంలో నయం చేశారు యశోదా డాక్టర్లు. పెల్విక్ జాయింట్స్, ఇటర్వెర్టబుల్ డిస్క్, కోకిక్స్ లో ఇబ్బందుల వల్ల వెన్నుపూసలో నొప్పి ఏర్పడుతుందని, దీర్ఘకాలం కొనసాగే ఇలాంటి వెన్ను నొప్పికి బెస్ట్ చికిత్స రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (RFA) అని, వెన్నెముకలోని నరాలలో నొప్పి సంకేతాలను అంతరాయం కలిగించడానికి వేడిని ఉపయోగించే ఒక సాంకేతిక చిత్సా విదానమే ఆర్ఎఫ్ఏ అని డాక్టర్ సుమన్ రెడ్డి తెలిపారు.

RFA procedure at Yashoda Hospitals helps Weightlifter Halavath Karthik recover back pain

రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (RFA) అనేది ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పిని తగ్గించడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ అని, చికిత్స సమయంలో, వీపు కింది భాగంలో ఒక చిన్న ప్రోబ్‌ను ప్రవేశపెట్టి, ఎక్స్‌రే పరికరాన్ని ఉపయోగిస్తూ, ప్రోబ్‌ను నొప్పి ప్రభావిత ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడి నాడీ కణజాలంలోకి రేడియో తరంగాలను పంపుతారు. నొప్పి సంకేతాలను నిరోధించడానికి తరంగాలు ప్రభావిత నరాల చిన్న భాగాలను వేడి చేస్తాయి. తేలికపాటి అనస్తీషియాతోనే ఈ ప్రక్రియను సులువుగా పూర్తి చేస్తారని, ఎటువంటి నొప్పి ఉండదని, దీర్ఘకాలిక వెన్నునొప్పికి ఆర్ఎఫ్ఏ చక్కటి విధానమని డాక్టర్ సుమన్ రెడ్డి చెబుతున్నారు.

  MLA Jagga Reddy Helping Corona Patients ఆఫీస్ నెంబర్ కి ఫోన్ చేస్తే తగిన సహాయం చేస్తా

  RFA procedure at Yashoda Hospitals helps Weightlifter Halavath Karthik recover back pain

  యశోదా ఆస్పత్రిలో రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (RFA) తర్వాత పూర్తిగా కోలుకున్న వెయిట్ లిఫ్టర్ హలావత్ కార్తీక్ మళ్లీ ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. ఎంతో మంది డాక్టర్లు, ఎన్నెన్నో ఆస్పత్రులు తిరిగినా నయం కాని వెన్నునొప్పిని డాక్టర్ సుమన్ రెడ్డి దూరం చేయగలిగారని, కెరీర్ కష్టమేమో అనిపించిన సమయంలో బాగా శ్రద్ధతీసుకుని ఆర్ఎఫ్ఏ చికిత్స అందజేశారని కార్తీక్ అన్నారు. ఆర్ఎఫ్ఏ విధానానికి, యశోదా ఆస్పత్రి డాక్టర్ సుమన్ రెడ్డికి కార్తీక్ ధన్యవాదాలు తెలిపారు. 2024 ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో ప్రాక్టీస్ కనొసాగిస్తున్నట్లు చెప్పాడు.

  English summary
  A 18-year-old National Level Weightlifting Champion from Hyderabad, Halavath Karthik, who was suffering from chronic back pain, becoming a gold medalist in the Telangana Senior State Championship after being recovered from the pain with Radiofrequency Ablation (RFA) procedure performed on him by the doctors at Yashoda Hospitals Somajiguda in Hyderabad. Dr. Ravi Suman Reddy, Consultant Neuro & Spine Surgeon at Yashoda Hospitals Somajiguda, who recommended Radiofrequency Ablation.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X