Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..!
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రత్యేక రైళ్లను పొడిగించింది. దక్షిణ మధ్య రైల్వే (SCR) బుధవారం, సెప్టెంబర్ 4, ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అహ్మదాబాద్ - తిరుచ్చిరాపల్లి నుంచి గురువారం నడిచే రైలు నంబర్ 09419 సెప్టెంబర్ 26 నుంచి డిసెంబర్ 26 వరకు పొడిగించారు. రైలు నంబర్ 09420 తిరుచ్చిరాపల్లి - అహ్మదాబాద్ నుంచి ఆదివారం నడిచే రైలు సెప్టెంబరు 29 నుంచి డిసెంబర్ 29 వరకు నడపనున్నారు.
ఓఖా-మధురై నుంచి సోమవారం నడిచే రైలు నంబర్ 09520 సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 30 వరకు పొడిగించారు. శుక్రవారం నడిచే మదురై-ఓఖా నుంచి రైలు నంబర్ 09519 అక్టోబర్ 4 నుండి జనవరి 3 వరకు నడపనున్నారు. దక్షిణ మధ్య రైల్వే బుధవారం సికింద్రాబాద్-విశాఖపట్నం రైలు, విశాఖపట్నం-సికింద్రాబాద్ రైలును రద్దు చేశారు. మణుగూరు-సికింద్రాబాద్, సికింద్రాబాద్-గుంటూరు, సికింద్రాబాద్-గుంటూరు, సికింద్రాబాద్-భద్రాచలం, భద్రాచలం-సికింద్రాబాద్ రైళ్లు రద్దు చేశారు.

హైదరాబాద్-విశాఖపట్నం రైలు దారి మళ్లీంచారు. అలాగే హైదరాబాద్-తాంబరం, మహబూబ్ నగర్-విశాఖపట్నం, సికింద్రాబాద్-కాకినాడ టౌన్, బీదర్-మచిలిపట్నం, దర్భంగా-మైసూరు రైళ్లను దారి మళ్లీంచారు. నాలుగు రోజుల తర్వాత తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న ట్రాక్ ను రిపేర్ చేసి పునరుద్ధరించారు. విజయవాడ-హైదరాబాద్ మధ్య రైళ్ల రాకపోకలను బుధవారం పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.
వరదల్లో దెబ్బతిన్న ట్రాక్‌లలో ఒకదాన్ని పునరుద్ధరించిన తర్వాత, దక్షిణ మధ్య రైల్వే (SCR) సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ను ప్రయాణికులు లేకుండా హైదరాబాద్ వైపు ట్రయల్ రన్ చేశారు. అనంతరం కాజీపేట-విజయవాడ ట్రంక్ రూట్‌లో పునరుద్ధరించిన ట్రాక్‌పై గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. గుంటూరు ఎక్స్‌ప్రెస్ గుంటూరు, విజయవాడ, వరంగల్ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications