హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర: జితేందర్ రెడ్డి, డీకే అరుణ..? ప్రమేయంపై విచారణ: సీపీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర రాజ‌కీయాల్లో పెను దుమారం రేపింది. అయితే మంత్రి హ‌త్య‌కు జ‌రిగిన కుట్ర‌లో బీజేపీ సీనియ‌ర్ నేత, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి పాత్ర‌తోపాటు ఆ పార్టీకి చెందిన మహిళా నేత‌, మాజీ మంత్రి డీకే అరుణ పాత్ర‌పై ద‌ర్యాప్తు చేప‌డుతామని సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర వెల్ల‌డించారు. మంత్రి హ‌త్య‌కు జ‌రిగిన కుట్ర‌కు సంబంధించిన వివ‌రాలు మీడియాకు వెల్లడించారు

ఎవరీ రఘు..

ఎవరీ రఘు..

మంత్రి హ‌త్య‌కు ప్లాన్ చేసిన వారిలో ర‌ఘు.. జితేంద‌ర్ రెడ్డికి చెందిన ఢిల్లీ నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రిని హ‌త్య చేసేందుకు జ‌రిగిన కుట్ర పోలీసుల ప్ర‌మేయం లేకుండానే బ‌య‌ట‌ప‌డింద‌ని చెప్పిన క‌మిష‌న‌ర్.. ప్లాన్ చేసిన వారిలో కొంద‌రిపై మ‌రికొంద‌రు దాడికి య‌త్నించడంతో ఈ ఘ‌ట‌న వెలుగు చూసింద‌న్నారు. మంత్రిని హ‌త్య చేసేందుకు జ‌రిగిన కుట్ర‌లో ఇప్ప‌టికే 8 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. వీరిలో ముగ్గురు ఢిల్లీలోని జితేంద‌ర్ రెడ్డి నివాసంలో ఉంటున్న‌ట్లుగా గుర్తించామ‌ని, ఢిల్లీ పోలీసుల స‌హ‌కారంతోనే వారిని అరెస్ట్ చేశామ‌ని ఆయ‌న తెలిపారు.

జితేందర్ ఆశ్రయం

జితేందర్ ఆశ్రయం


మంత్రి హ‌త్య‌కు కుట్ర చేసిన వారిలో కొంద‌రు జితేంద‌ర్ రెడ్డి నివాసంలో ఆశ్ర‌యం పొందిన నేప‌థ్యంలో కుట్ర‌లో ఆయన పాత్ర ఏమైనా ఉందా? అన్న కోణంలో విచార‌ణ చేప‌డుతామని స్టీఫెన్ ర‌వీంద్ర చెప్పారు. మాజీ మంత్రి డీకే అరుణ పాత్ర కూడా ఏమైనా ఉందా? అన్న కోణంలో ద‌ర్యాప్తు సాగిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. మంత్రి హ‌త్య‌కు జ‌రిగిన కుట్ర‌లో ఆదిలోనే ఇద్ద‌రు కీల‌క నేత‌ల పేర్లు పోలీసుల నోట వినిపించ‌డం నిజంగా క‌ల‌క‌లం రేపుతోంది.

తమకేం తెలియదే..

తమకేం తెలియదే..

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ‌త్యకు జ‌రిగిన కుట్ర‌లో త‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో చాలా వేగంగా డీకే అరుణ స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరాచ‌కాలు అంద‌రికీ తెలిసిన‌వేన‌న్నారు. ఈ వ్య‌వ‌హారంలో అస‌లు నిజాలు బ‌య‌ట‌పెట్టాల‌ని పోలీసుల‌ను డిమాండ్ చేశారు. త‌మకు శ్రీనివాస్ గౌడ్‌పై క‌క్ష ఎందుకు ఉంటుంద‌ని కూడా ఆమె ప్ర‌శ్నించారు.

నలుగురి కిడ్నాప్

నలుగురి కిడ్నాప్

ఇటు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి ఇంటిలో న‌లుగురు వ్య‌క్తులు కిడ్నాప్‌కు గుర‌య్యారనే వార్త నిన్న కలకలం రేపింది. మంగ‌ళ‌వారం సాయంత్రం ఢిల్లీలోని జితేంద‌ర్ రెడ్డి నివాసంలో ఘటన జరిగింది. కిడ్నాప్‌పై జితేంద‌ర్ రెడ్డి వ్య‌క్తిగ‌త సిబ్బంది ఢిల్లీలోని సౌత్ ఎవెన్యూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

English summary
srinivas goud murder conspiracy jitender, dk aruna involvement cyberabad cp stephen ravindra said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X